Rajanna Sircilla District : జీ20 ముద్రతో చేనేత మగ్గంపై ప్రత్యేక వస్త్రం తయారు చేసిన సిరిసిల్ల నేతన్న

జీ20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో సిరిసిల్లకు చెందిన ఓ నేత కార్మికుడు 2 మీటర్ల పొడవైన బట్టతో ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేసాడు. దాని ప్రత్యేకత ఏంటంటే?

Rajanna Sircilla District

Rajanna Sircilla District : జీ20 సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ నేత కార్మికుడు హరి ప్రసాద్ రెండు మీటర్ల పొడవైన బట్టపై ప్రత్యేక వస్తాన్ని రూపొందించారు. దాని ప్రత్యేకత ఏంటంటే?

G20 Summit Delhi: ఇక నుంచి జీ20 కాదు, జీ21 అని పిలవాలి.. కారణం ఏంటో తెలుసా?

రాజన్న సిరిసిల్లకు చెందిన హరి ప్రసాద్ అనే చేనేత కార్మికుడు జీ20 సదస్సు జరగుతున్న నేపథ్యంలో మగ్గంపై ప్రత్యేక వస్త్రాన్ని రూపొందించారు. 2 మీటర్ల పొడవున్న ఫాబ్రిక్ పై భారతదేశ పటం, అందులో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఫోటోతో పాటు 20 దేశాధినేతల చిత్రాలను అందులో పొందుపరిచారు. వస్త్రానికి రెండు వైపులా అంచుల చివరన జీ20 చిహ్నం వచ్చేలా తయారు చేసారు. దీనిని నేయడానికి తనకు వారం రోజుల సమయం పట్టిందని హరి ప్రసాద్ తెలిపారు.

G20 Summit 2023: జీ20 దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు

ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వస్త్రాన్ని సిరిసిల్లలో స్ధానికంగా ప్రదర్శించారు. ఈ కళాఖండాన్ని అవకాశం వస్తే ప్రధాని మోడీని కలిసి ఆయనకు స్వయంగా అందజేయాలని ఉందని హరి ప్రసాద్ ఆకాంక్షిస్తున్నారు.