Terrorist Sympathizers Arrest : హైదరాబాద్ లో ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులు అరెస్టు.. ఉగ్ర కుట్రలో కీలక విషయాలు

విచారణలో భూపాల్ టు హైదరాబాద్ కు ఉగ్రవాదుల లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.

Terrorist Sympathizers Arrest

Terrorist Sympathizers Arrest : హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు కలకలం రేపుతున్నాయి. నగరంలో మొత్తం ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సల్మాన్ సైతం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అరెస్టైన ఆరుగురు, భూపాల్ లో అదుపులోకి 11 మందిని ఏటీఎస్ అధికారులు కోర్టులో హాజరు పర్చారు. దీనికి భూపాల్ ప్రత్యేక న్యాయస్థానం మే19 వరకు కస్టడీ విధించింది.

ఉగ్ర కుట్రలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. విచారణలో భూపాల్ టు హైదరాబాద్ కు ఉగ్రవాదుల లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. పెద్ద నగరాలను టార్గెట్ చేసుకున్న నిందితులు అక్కడే సాధారణ పౌరులుగా స్థిరపడినట్లుగా తెలుస్తోంది.

Hyderabad : ఒకడు డెంటిస్ట్, మరొకడు ఇంజినీర్, ఇంకొకడు HOD.. హైదరాబాద్‌లో ఉగ్ర కదలికల కేసులో సంచలన విషయాలు

ఉగ్రవాది శిక్షణలో భాగంగా 17మంది హైదరాబాద్ కు వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర కదలికలు బయటపడటంతో ఆందోళనను కలిగిస్తోంది. కేంద్ర ఇంటలిజెన్స్ సాయంతో నిన్న మంగళవారం భోపాల్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ను నిర్వహించి 17మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ప్రత్యేక భద్రత మధ్య మధ్యప్రదేశ్ కు తరలించారు.

నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, ఉగ్ర సాహిత్యం, కత్తులు, ఎలక్ట్రానిక్ డివైజ్, డ్రాగులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇస్లామిక్ జీహాదీని కూడా పోలీసులు గుర్తించారు. వీరంతా 18 నెలల నుంచి హైదరాబాద్ లోనే మకాం వేశారు. యువకులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Tirumala : తిరుమలలో ఉగ్రవాదులు.. ఆ ఫేక్ ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే

సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీంతో పాటు తెలంగాణ పోలీసు శాఖ జాయింట్ ఆపరేషన్ ను నిర్వహించి 17మందిని అరెస్ట్ చేసింది. మొత్తం భోపాల్ లో 11మందిని, హైదరాబాద్ లో ఆరుగురు నిందితులను ప్రస్తుతం ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేసి భారీ బందోబస్తు నడుమ మధ్యప్రదేశ్ లోని భోపాల్ కోర్టు ముందు హాజరు పరిచింది. 17మందికి మే 19వ తేదీ వరకు రిమాండ్ విధించింది.