Hyderabad : హైదరాబాద్‌లో వింత ఘటన.. భూమిలో నుంచి పొగలు.. స్థానికులు ఏం చేశారంటే?

హైదరాబాద్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను చూసిన వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Smoke From Earth

Smoke From Earth : హైదరాబాద్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను చూసిన వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జూబ్లీహిల్స్‌ పరిధిలోని కేబీఆర్‌ పార్క్‌ సమీపంలో భూమిలో నుంచి పొగలు బయటకు వచ్చాయి. మొదట పొగ చిన్నగా ఉండి క్రమంగా పెద్దదైంది. భూమి పొరల నుండి పొగ వచ్చింది. ఓ వైపు వర్షం కురుస్తుండగా తడి నేల నుంచి పెద్దఎత్తున పొగలు రావడం అందరినీ భయాందోళనకు గురి చేసింది.

Also Read : JR NTR : మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై స్పందించిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. ఏమ‌న్నారంటే..?

భూమి నుంచి పొగలు రావడంతో వాహనదారులు, స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. మరికొందరు పొగలు వస్తున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. వర్షం కురుస్తున్న సమయంలో నీటిపై పొగలు రావడం చూసి ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో తెలియక అక్కడున్న వారందరూ అయోమయంలో పడ్డారు. హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తున్న కొద్దిసేపటికే ఇది జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. కాగా ఈ అంశంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు. భూ అంతర్భాగంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు