Sonia Gandhi: కర్ణాటకకు అప్పుడు 5 హామీలే.. తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించిన సోనియా

1. మహాలక్ష్మి పథకం, 2. రైతు భరోసా పథకం, 3. గృహ జ్యోతి పథకం...

Sonia Gandhi

Sonia Gandhi – Telangana: కర్ణాటక ఎన్నికల ముందు ఆ రాష్ట్రానికి 5 హామీలు ప్రకటించి గెలుపొందిన కాంగ్రెస్ (Congress) పార్టీ తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ మాట్లాడారు. తెలంగాణకు హామీలు ఇచ్చారు.

6 హామీలు ఇవే..

1. మహాలక్ష్మి పథకం
2. రైతు భరోసా పథకం
3. గృహ జ్యోతి పథకం
4. ఇందిరమ్మ ఇంటి పథకం
5. యువ వికాసం పథకం
6. చేయూత పెన్షన్‌ పథకం

అధికారంలోకి రాగానే పై ఆరు పథకాలను అమలు చేస్తారు. గృహలక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తారు. అలాగే, ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తారు. రాష్ట్రంలోని పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తారు. రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15,000 ఇస్తారు. కౌలు రైతుకి కూడా అంతే ఇస్తారు. రైతు కూలీలకు ఏడాది రూ.12,000 అందుతాయి.

యువ వికాస పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డులు అందిస్తారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద గృహ నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఇస్తారు. చేయూత పెన్షన్‌ పథకం కింద నెలకు రూ.4,000 చొప్పున అందిస్తారు. అలాగే, రూ.10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తారు.

All party meeting: ఢిల్లీలోని పార్లమెంటు లైబ్రరీ బిల్డింగ్‌లో అఖిలపక్ష సమావేశం

ట్రెండింగ్ వార్తలు