special Telangana buses for dasara 2020 : దసరా పండుగ వచ్చేస్తోంది. ఇప్పటికే నవరాత్రులు మొదలయ్యాయి కూడా. నగరంలో నివాసం ఉంటున్న ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా..నష్టాల్లో ఉన్న ఆర్టీసీ..దీనిని క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తోంది.
అందులో భాగంగా.. 3000 అదనపు బస్సులు నడుపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు పెంచి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తామని టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఆర్‌ఎం వరప్రసాద్ వెల్లడించారు.
https://10tv.in/dasara-navratri-2020-speacial-nine-colours-of-navratri-and-their-significance/
రూట్లు : –
జూబ్లీ బస్‌స్టేషన్, జేబీఎస్ నుంచి : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల బస్సులు.
ఉప్పల్ క్రాస్‌రోడ్, ఉప్పల్ బస్ స్టేషన్ నుంచి : యాదగిరిగుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూర్, వరంగల్ బస్సులు
దిల్‌సుఖ్‌నగర్ నుంచి : మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే బస్సులు
ఎంజీబీఎస్ ఫ్లాట్ ఫారాలు :
ఫ్లాట్ ఫారం 10 నుంచి 13 వరకు ఖమ్మం. 14-15 దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్‌కు. 18,19 ఉప్పల్‌క్రాస్ రోడ్‌కు. 23-25 వరకు పాతాల గంగ, కల్వకుర్తి వైపు. 26-31 రాయచూర్, మహబూబ్‌నగర్ వైపు. 32-34 నాగర్ కర్నూల్, షాద్‌నగర్. 35-36 రామాపురం.
41-42 పెబ్బేర్, కొత్తకోట, గద్వాల్. 46-47 మెదక్, బాన్సువాడ, బోధన్. 48-52 జహీరాబాద్, బీదర్, సంగారెడ్డి, నారాయణ్‌ఖేడ్. 53-55 జేబీఎస్ వైపు. 56-58 నాగ్‌పూర్, అమరావతి, నాందేడ్, అకోలా(మహారాష్ట్ర). 62 దేవరకొండ. 63-65 పరిగి, తాండూరు, వికారాబాద్ వైపు స్పెషల్ బస్సులు నడుస్తాయి.