తిరుపతికి వెళ్తున్నారా? గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవుల వేళ ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవిగో

మరోవైపు, కాచిగూడ - నాగర్ ​కోయిల్ ​స్పెషల్ ట్రైన్లను కూడా రైల్వే అధికారులు పొడిగించారు.

Special Trains

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. దీంతో దక్షిణమధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్లపల్లి – తిరుపతి మధ్య 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు. మే 7 నుంచి జూన్ ​25 వరకు చర్లపల్లి నుంచి ఎనిమిది స్పెషల్ ట్రైన్లు నడుస్తాయి.

ఆయా రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం 6.50 గంటలకు రైలు బయలుదేరి తదుపరి రోజు ఉదయం 6.55 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఇక మే 8 నుంచి (తిరుగు ప్రయాణంలో) ప్రతిరోజు సాయంత్రం 4.55 గంటలకు రైలు ​తిరుపతి నుంచి బయలుదేరి తదుపరి రోజు ఉదయం 6 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

Also Read: ఆర్ఆర్ బ్యాటర్‌ వైభవ్ సూర్యవంశీ షాట్లు బాదిన తీరుపై జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసల జల్లు.. ఏమన్నాడంటే?

ఈ ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

మరోవైపు, కాచిగూడ – నాగర్ ​కోయిల్ ​స్పెషల్ ట్రైన్లను రైల్వే అధికారులు పొడిగించారు. మే 9 నుంచి జూన్ ​6 వరకు కాచిగూడ – నాగర్​ కోయిల్ మధ్య 5 స్పెషల్ ట్రైన్లు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో నాగర్ కోయిల్​ – కాచిగూడ మధ్య మే11 నుంచి జూన్ 8 వరకు రైళ్లు నడుస్తాయి.