కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఏమన్నారో తెలుసా?

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందని చెప్పారు.

Sridhar Babu

Sridhar Babu: లోక కల్యాణార్థం గణపతి నవరాత్రులలో భాగంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు-శైలజ రామయ్యర్ దంపతులు ప్రత్యేక గణపతి హోమంలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రావుల చెరువుకట్ట గజానన సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ… తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందని చెప్పారు. బీఆర్ఎస్‌కి చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించినట్లు తెలిపారు.

వారికి సంబంధించిన అంశాల విషయంలో వారు తలదూర్చినట్టుగా తాము తలదూర్చమని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు వారి అంతర్గత సమస్యల్ని వారే పరిష్కరించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై నేపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

ఎవరు తెలివిగలవారో ప్రజలే చెబుతారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడఇ ప్రజలందరూ తెలంగాణ ప్రజలేనని, వాళ్లందరినీ గౌరవిస్తామని అన్నారు. తాము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. నగర్ బ్రాండ్ ఇమేజ్‌ని కొన్ని ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు.

Mahesh Kumar Goud: టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్