ssc student raped : కామారెడ్డి జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం

కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై టీఆర్‌ఎస్‌ నేత సయ్యద్‌ ఆసిఫ్‌ అత్యాచారం చేశాడు.

Ssc Student Raped In Kamareddy District

ssc student raped : కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై టీఆర్‌ఎస్‌ నేత సయ్యద్‌ ఆసిఫ్‌ అత్యాచారం చేశాడు. పదో తరగతి చదువుతున్న బాధితురాలికి… సయ్యద్‌ ఆసిఫ్‌ మేనమామ అవుతాడు. ఇటీవల బాధితురాలి తల్లి చనిపోవడంతో తరచూ ఇంటికి వచ్చిపోతున్న సయ్యద్ ఆసిఫ్‌… ఆమెపై కన్నేశాడు.

ఆమెను బెదిరించి లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించి… బంధువుల ఇంట్లో వదిలివెళ్లాడు. బాధితురాలు అస్వస్థతకు గురికావడంతో అసలు విషయం తెలుసుకున్న బంధువులు… సయ్యద్‌ ఆసిఫ్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.