ఊరెళ్దాం : దసరా రద్దీ షురూ..స్పెషల్ బస్సులు రెడీ

  • Publish Date - September 28, 2019 / 02:33 AM IST

దసరా హాలీడేస్ వచ్చాయి. పట్ణణంలో ఉన్నవారు తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు బ్యాగులతో సిద్ధమై పోయారు. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి పాఠశాలలకు, కళాశాలలకు హాలీడేస్ ప్రకటించిన విషయం తెలిసిందే. చివరి క్షణంలో రద్దీ ఉంటుందనే ఉద్దేశ్యంతో తొందరగా ఊర్లకు వెళ్లాలని చాలా మంది డిసైడ్ అయిపోయారు. దీనితో ప్రధాన బస్టాండులు జూబ్లీ, ఇమ్లీబన్ బస్ స్టేషన్, ప్రదాన రైల్వే స్టేషన్లు కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్‌లో అప్పుడే రద్దీ కనిపిస్తోంది.

ఉదయాన్నే ఫ్యామిలీతో పలు కుటుంబాలు వెళుతుండడం కనిపించింది. ప్రజల రద్దీని క్యాష్ చేసుకోవాలని ప్రైవేటు ఆపరేటర్స్ కూడా సిద్ధమై పోయారు. బస్టాండులు, రైల్వే స్టేషన్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. జేబీఎస్ ప్రయాణీకులతో సందడిగా మారిపోయింది. 

మరోవైపు పండుగను పురస్కరించుకుని నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడుపుతోంది. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి అదనంగా 1608 బస్సులను అందుబాటులో ఉంచారు. శనివారం నుంచి ప్రయాణీకుల రద్దీ పెరగనుందని అధికారులు పేర్కొంటున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ రూట్లను నాలుగు సెక్టార్లుగా విభజించారు.

27వ తేదీన 25 బస్సులు, 28న 68, 29న 78, 30న 77, అక్టోబర్ 1న 145, అక్టోబర్ 02న 131, అక్టోబర్ 3న 84, అక్టోబర్ 4న 161, అక్టోబర్ 5న 330, అక్టోబర్ 6న 276, అక్టోబర్ 7న 194, అక్టోబర్ 8న 12 స్పెషల్ బస్సులను నడుపుతన్నట్లు పికెట్ డిపో మేనజర్ వెల్లడించారు. అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ మధ్యన ప్రతి సెక్టార్‌లో డీఎం, డీవీఎం స్థాయి గల ఐదుగురు అధికారులు ప్రయాణీకులకు అందుబాటులో ఉండనున్నారు. 
Read More : ఎంజాయ్ : దసరా సెలవులు ప్రారంభం