Indiramma Housing Scheme
Indiramma Housing Scheme: తెలంగాణ సర్కారు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల కోడ్‌కి ముందే నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలస్యం చేస్తే ఎన్నికల కోడ్ అడ్డంకి మారే అవకాశం ఉందని భావిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తోంది.
Also Read: సర్కారు కీలక ఆదేశాలు.. ఇకపై మార్కుల పేరుతో స్టూడెంట్లను సెక్షన్లుగా విభజించారో..
పట్టణాల్లో హడ్కో నిబంధనలు అమలు చేయాలని ఇప్పటికే సర్కారు ఇచ్చిన ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. దీంతో ఇందిరమ్మ పథకం ఇళ్ల డిజైన్‌లో మార్పులు జరగనున్నాయి.
గత కేసీఆర్ సర్కారు రూపొందించిన డబుల్ బెడ్రూం డిజైన్‌లో మార్పులు చేయడం తప్పనిసరి అవుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో రూ.8 వేల కోట్ల నిధులను రుణంగా మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఇందుకు ఆ సంస్థ మార్గదర్శకాలు అనుసరించాల్సి ఉంటుంది.
త్వరలోనే లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇందిరమ్మ పథకం ఇళ్ల డిజైన్‌లాగే సింగిల్ బెడ్రూం, హాల్ కిచెన్, చిన్న వరండా ఉండేలా డిజైన్ చేసే అవకాశం ఉంది.