Ramzan
Ramzan: తెలంగాణలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 19 నుంచి మార్చి 20 వరకు ముస్లిం ఉద్యోగులు విధుల నుంచి సాయంత్రం 4 గంటలకే ప్రార్థనల కోసం వెళ్లడానికి వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణ రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఇది 9వ మాసం. రంజాన్ నెల ఆకాశంలో నెలవంక కనిపించడంతో ప్రారంభమవుతుంది. ఈ సారి మన దేశంలో ఈ నెల 18 లేదా 19 నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఒకవేళ ఈ నెల 17న సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపిస్తే ఆ తర్వాతి రోజు నుంచి రంజాన్ ప్రారంభమవుతుంది. ఒకవేళ ఆ రోజున నెలవంక కనపడకపోతే ఈ నెల 19 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుంది.
ఇస్లాం ధర్మంలోని 5 ప్రధాన స్తంభాలలో రంజాన్ ఉపవాసం ఒకటి. మిగతావి షహాదా (విశ్వాసం), సలాత్ (నమాజ్), జకాత్ (దానం), హజ్ (యాత్ర).