సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ అనర్హత వేటు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు: కడియం శ్రీహరి కీలక కామెంట్స్‌

స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా ఫేస్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కడియం శ్రీహరి చెప్పారు. ఉప ఎన్నిక గురించి ఆలోచన వద్దని, అవి వస్తాయా? రావా? వస్తే ఏం చేద్దామనేది తర్వాత ఆలోచిద్దామని అన్నారు.

Kadiyam Srihari

Kadiyam Srihari: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ అనర్హత వేటు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు.

స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా ఫేస్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కడియం శ్రీహరి చెప్పారు. ఉప ఎన్నిక గురించి ఆలోచన వద్దని, అవి వస్తాయా? రావా? వస్తే ఏం చేద్దామనేది తర్వాత ఆలోచిద్దామని అన్నారు.

ఏ గ్రామంలో చూసినా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలనేది తన టార్గెట్ అని కడియం శ్రీహరి చెప్పారు. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. (Kadiyam Srihari)

Also Read: రిలయన్స్ AGM లో సంచలనాలు.. జియో హాట్ స్టార్ లో అదిరిపోయే ఫీచర్లు.. వింటేనే వావ్.. ఇక చూస్తే మైండ్ బ్లాంక్

వాటన్నిటికీ మన గెలుపు ద్వారానే సమాధానం చెబుదామని కడియం శ్రీహరి చెప్పారు. నియోజకవర్గంలో పాత, కొత్త వివాదం వద్దని అన్నారు. ఎవరైతే గెలుస్తారో వాళ్లే మన హీరోలని తెలిపారు. అక్కడాఇక్కడా తిరిగి ఆగం కావద్దని చెప్పారు. ఏం జరిగినా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో తన ద్వారానే జరుగుతుందని అన్నారు.

కాగా, గత తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ నుంచి పోటీ చేసి గెలిచి, కాంగ్రెస్‌ గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ముందుగా హైకోర్టు వెళ్లి, ఆ తర్వాత సుప్రీంకోర్టు మెట్లెక్కి.. తిరిగి శాసనసభకు చేరుకున్న విషయం తెలిసిందే.

ఆయా ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారు. కొన్ని రోజుల్లో స్పీకర్‌కు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.