Lockdown Stopped Transport : లాక్ డౌన్ తో స్తంభించిన ప్రజా రవాణా

తెలంగాణలో నేటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఈనెల 12 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.

Stopped Public Transport With Lockdown In Telangana

Stopped public transport : తెలంగాణలో నేటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఈనెల 12 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకే లాక్ డౌన్ ను సడలించారు. టీకా కోసం వెళ్లే వారికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అత్యవసర సర్వీసులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

కఠిన లాక్ డౌన్ అమలకు పోలీసులు సిద్ధమయ్యారు. సైబరాబాద్ లో సీపీ సజ్జనార్ రంగంలోకి దిగారు. హైటెక్ సిటీ వద్ద లాక్ డౌన్ అమలును పరిశీలిస్తున్నారు. లాక్ డౌన్ విధించడంతో ప్రజా రవాణా స్తంభించింది. వాహనాలు ఎక్కడికకక్కడే నిలిచపోయాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకు చేరుకున్నాయి. మెట్రో సర్వీసులు కూడా బంద్ అయ్యాయి.

అత్యవసరాలు మినహాయించి తెలంగాణ మొత్తం షట్ డౌన్ విధించారు.  ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిక్కిరిసి పోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ కావడంతో రైల్వేకు లాక్ డౌన్ వర్తించదు.

33 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయి. ధాన్యం కొనుగోళ్లకు మినహాయింపు ఇచ్చారు. ఉపాధీ హామీ పనులు యథాతధంగా కొనసాగనున్నాయి. వివాహాలకు 40 మంది, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.

సినిమా హాళ్లు, క్లబ్ లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ క్లోజ్ చేశారు. అత్యవసర ప్రయాణానికి ఈ పాస్ తప్పనిసరి చేశారు. వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ సూచించారు.రేపు ఉదయం 6 గంటల వరకు పూర్తి ఆంక్షలతో తొలి రోజు లాక్ డౌన్ ఉంటుంది. ఈ నెల 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుంది.