Police station
Sangareddy District:ద్యా నాయక్ అనే మందుబాబు పోలీసులను బురిడీ కొట్టించాడు. అయితే, కొద్దిసేపటి తరువాత అసలు విషయం గ్రహించిన పోలీసులు బద్యా నాయక్ కు బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించి కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించి పంపేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. డేట్ ఫిక్స్
బద్యా నాయక్, చాందిబాయి భార్యాభర్తలు. వారిద్దరూ నిత్యం గొడవలు పడుతుండేవారు. బద్యా నాయక్ మద్యానికి బానిసై రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. మంగళవారం రాత్రికూడా మద్యం సేవించి వచ్చిన అతను భార్యతో గొడవపడ్డాడు. అయితే, బుధవారం ఉదయం లేచిచూసే సరికి భార్య కనిపించకపోవటంతో తన మీద అలిగి ఇల్లు వదిలిపోయిందని భయపడ్డాడు. దీంతో మళ్లీ ఫుల్ గా మద్యం సేవించాడు. అయితే, తన భార్య ఎక్కడికి వెళ్లిందో వెతక్కునే ఓపిక లేక ఓ ప్లాన్ వేశాడు. నా భార్యను నేనే చంపానంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు రంగంలోకిదిగి తన భార్య కోసం వెతుకుతారని బద్యా నాయక్ భావించాడు. దీంతో ఫుల్ గా మద్యం సేవించి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.
Also Read: Vijaya milk: రైతులకు గుడ్‌న్యూస్.. విజయ పాల సేకరణ ధరలు పెంపు యోచనలో ప్రభుత్వం.. ఎంతంటే?
పోలీసు స్టేషన్ కు వెళ్లి.. సార్ నా పెళ్లాన్ని కత్తితో పొడిచి నేనే చంపాను అంటూ బద్యా నాయక్ హల్ చల్ చేశాడు. దీంతో పోలీసులు అతని నుంచి వివరాలు సేకరించి హడావుడిగా కల్వోనికుంట తండాకు వెళ్లారు. తండాలోని అంగన్ వాడీ కేంద్రం పక్కన చాందిబాయి నిద్రిస్తుంది. ఆమె క్షేమంగా ఉండటంతో పోలీసులకు అసలు విషయం అర్ధమైంది. మద్యంమత్తులో బద్యా నాయక్ మననే బురిడీ కొట్టించాడని పోలీసులు గ్రహించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి బద్యా నాయక్ కు కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించిన పోలీసులు.. కొద్దిసేపటి తరువాత ఇంటికి పంపించేశారు.