Sunday Funday At Charminar : రేపటి నుంచి చార్మినార్ వద్ద సాయంత్రం పూట “సండే-ఫన్డే
రేపు ఆదివారం అక్టోబర్ 17 నుంచి చార్మినార్ పరిసరాలు నగర ప్రజలకు వినోదాన్ని కలగచేయనున్నాయి.
- chvmurthy
- Updated on- October 16, 2021 / 01:13 PM IST
Sunday Funday At Charminar
Sunday Funday At Charminar : రేపు ఆదివారం అక్టోబర్ 17 నుంచి చార్మినార్ పరిసరాలు నగర ప్రజలకు వినోదాన్ని కలగచేయనున్నాయి. ట్యాంక్ బండ్ మీద నిర్వహించినట్లే చార్మినార్ వద్దకూడా ఇకనుంచి ప్రతి ఆదివారం సండే-ఫన్డే నిర్వహించనున్నారు. వివిధ రకాల వినోద కార్యక్రమాలతో నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సండే-ఫన్డే కార్యక్రమం కొనసాగుతుంది. సాయంత్రం 6:30 గంటలకు పోలీస్ బ్యాండ్ నిర్వహించనున్నారు. రాత్రి 8:30 గంటలకు దక్కనీ మజాహియా ముషారియా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయనున్నారు.
Also Read : Sadist Wife : నిద్రిస్తున్న భర్తపై వేడినీళ్లు పోసిన భార్య
ఇక అర్ధరాత్రి వరకు లాడ్ బజార్‌ను తెరిచి ఉంచనున్నారు. పిల్లలను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. భోజన ప్రియులకు నోరూరించే ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. సండే – ఫన్డే కు వచ్చే వాహనదారులకు పార్కింగ్ సదుపాయాలు కల్పించారు.
