Sunke Ravi Shankar
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ని కక్ష పూరితంగా అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ అన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కేటీఆర్ కడిగిన ముత్యంలా వస్తారని సుంకే రవి శంకర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పూటకొక అక్రమ అరెస్ట్ జరుగుతోందని అన్నారు. రోజుకో బీఆర్ఎస్ నేతను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దిశగా బీఆర్ఎస్ పాలన కొనసాగిందని అన్నారు. 6 గ్యారెంటీలు ఉత్తవేనని చెప్పారు.
ఒక్క హామీని కూడా రేవంత్ సర్కారు నేరవేర్చలేదని సుంకే రవి శంకర్ విమర్శించారు. ఇచ్చిన హామీల నుంచి ప్రజలను మభ్య పెట్టే రకంగా రోజుకో డ్రామా చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామానికి తూట్లు పొడుస్తున్నారని చెప్పారు. చొప్పదండి ఎమ్మెల్యే స్థాయి మరచి చిల్లరగా మాట్లాడుతున్నారని తెలిపారు.
ఎన్నికల సమయంలో మొసలి కన్నీరు కార్చి సానుభూతితో ఎమ్మెల్యే అయ్యారని సుంకే రవి శంకర్ అన్నారు. దమ్ముంటే తమ కార్యకర్తపై చేయి వేసి చూడాలని చెప్పారు. తమ నేత పై వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు. ఆయన స్థాయికి మించి మాట్లాడితే బాగుండబోదని అన్నారు.
Israel-Hamas ceasefire: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఖతార్, అమెరికా ఏమన్నాయి?