Girijan Reservations : తెలంగాణ గిరిజన రిజర్వేషన్ పెంపు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్ పెంపు జీవోపైన తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లకు సూచించింది. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న జీవోను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఆదివాసీ సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి.

Girijan Reservations : గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్ పెంపు జీవోపైన తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లకు సూచించింది. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న జీవోను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఆదివాసీ సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి.

కొత్త జీవోతో రిజర్వేషన్లు 50శాతం దాటుతాయని, చెల్లప్ప కమిషన్ 9శాతం వరకే రిజర్వేషన్లు పెంచుకోవాలని సూచించిందన్నాయి ఆదివాసీ సంఘాలు. తెలంగాణ జీవోతో సుగాలి, లంబాడ, బంజారాలకు మాత్రమే లబ్ది చేకూరుతుందని వాదనలు వినిపించాయి. పిటీషన్లపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ దీపాకర్ దత్తా ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టులో జీవోని సవాల్ చేయాలని సూచించింది.

Also Read..IIT Reservations : ఐఐటీల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది. రిజర్వేషన్ల పెంపు జీవో చట్టబద్ధం కాదని, జీవో వల్ల ఆదివాసీలకు నష్టం జరుగుతుందని.. రాజ్యాంగ ధర్మాసనం తీర్పుకి విరుద్ధంగా ఉన్న జీవోని కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశాయి పలు గిరిజన సంఘాలు. ఈ మేరకు ఆధార్ సొసైటీ, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంక్షేమ అసోసియేషన్, ఆదిమ ఆదివాసుల సంక్షేమ, హక్కుల పరిరక్షణ గిరిజన సంఘాలు జనవరి 6న సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.

Also Read..Kapu Reservation Bill: కాపుల రిజర్వేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో.. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ఉందని, ఇది రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఉల్లంఘించడమే అని పిటిషన్ లో పేర్కొన్నాయి గిరిజన సంఘాలు. చెల్లప్ప కమిషన్ 9 శాతం వరకే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సిఫారసు చేసిందని, అందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉండగా జీఓ తీసుకురావడం చట్ట ప్రకారం చెల్లదని పిటిషనర్లు తమ వాదనలు వినిపించారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సుగాలి, లంబాడా, బంజారా గిరిజనులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని పిటీషనర్లు వాపోయారు. రాజ్యాంగబద్ధంగా ఈ జీవో చట్టబద్ధం కాదని, చట్టబద్ధం సాధ్యం కాని జీవో వల్ల గిరిజనులకు నష్టం చేకూరుతుందని పిటిషనర్లు వాదించారు. రాజ్యాంగ విరుద్ధంగా తీసుకొచ్చిన జీవో వల్ల ఉపయోగం శూన్యమని, ఎటువంటి లబ్ధి చేకూర్చని ఉత్తర్వులను కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి పలు గిరిజన సంఘాలు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గిరిజన సంఘాలు దాఖలు చేసిన పిటషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం.. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవాల్ చేయవచ్చని సూచించింది. ఈ మేరకు విచారణను ముగించింది ధర్మాసనం.