సుప్రీంకోర్టులో కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ..

లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

MLC Kavitha

MLC Kavitha : లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, కవిత బెయిల్ పిటిషన్ పై సీబీఐ, ఈడీకి సుప్రీంకోర్టు నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ల పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కవిత ఐడు నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

 

 

ట్రెండింగ్ వార్తలు