Suryapet Double Murder: వేపచెట్టు వివాదం, 25 ఏళ్లుగా గొడవలు.. ఇద్దరి హత్య.. తండ్రినే నరికేసిన కొడుకు
తెలంగాణలోని సూర్యాపేట(Suryapet Double Murder) జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో శనివారం అత్యంత దారుణమైన ఘోరం చోటుచేసుకుంది.
- V Santhosh Kumar
- Published on- August 29, 2026 / 02:49 PM IST
Suryapet double murder tree dispute son kills father mellacheruvu
- సూర్యాపేటలో ఇద్దరి దారుణ హత్య
- వేపచెట్టు వివాదంలో పాత కక్షలు
- తండ్రినే నరికేసిన సొంత కుమారుడు
Suryapet Double Murder: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో శనివారం అత్యంత దారుణమైన ఘోరం చోటుచేసుకుంది. ఇంటి సరిహద్దులో ఉన్న ఒక వేపచెట్టు విషయంలో గత 25 ఏళ్లుగా సాగుతున్న పాతకక్షలు చివరకు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాయి. వెంకటేశ్వర్లు, భూక్యా సైదా కుటుంబాల మధ్య సుదీర్ఘకాలంగా నడుస్తున్న ఈ స్థల వివాదం ఉన్నట్టుండి తీవ్ర ఘర్షణకు దారితీయడంతో తండాలో తీవ్ర భయాందోళనలు, ఘర్షణ వాతావరణం నెలకొంది.
AP Municipal Act: ఏపీ స్థానిక సంస్థల్లో బిగ్ చేంజ్.. గవర్నర్ నుంచి ఆమోదముద్ర.. కొత్త చట్టాలు ఇవే!
తండ్రి, పొరుగు వ్యక్తిని నరికిన రాము:
శనివారం ఉదయం వెంకటేశ్వర్లు వివాదాస్పద వేపచెట్టును నరికించడంతో ఆగ్రహానికి గురైన సైదా కుమారుడు రాము గొడ్డలితో(Suryapet Double Murder) తీవ్రంగా దాడి చేసి వెంకటేశ్వర్లును అక్కడికక్కడే హత్య చేశాడు. ఈ దాడిని అడ్డుకోవడానికి వచ్చిన తన సొంత తండ్రి సైదాను కూడా రాము గొడ్డలితో దారుణంగా నరికి చంపేశాడు. పొరుగు వ్యక్తితో పరస్పరం జరిగిన దాడుల్లోనే తండ్రి మరణించాడని కేసును పక్కదారి పట్టించేందుకే రాము ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులపై రాళ్లదాడి – నిందితుడు అదుపులోకి:
ఈ దారుణాన్ని గమనించిన గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి లోనై రాము ఇంటిపై రాళ్లదాడికి దిగారు. విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న మేళ్లచెరువు ఎస్ఐ నవీన్ కుమార్‌పై కూడా రాళ్లు పడటంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమే కాకుండా, నిందితుడు రామును అదుపులోకి తీసుకున్నారు.
