TSRTC Bill: ఆర్టీసీ బిల్లుపై ఎడతెగని ఉత్కంఠ.. రాజ్‌భవన్‌కు ఉన్నతాధికారులు.. స్పీకర్‌తో మంత్రి అజయ్ భేటీ

గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్పీకర్‌తో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భేటీ అయ్యారు.

Governor Tamilisai and CM KCR

Governor Tamilisai Soundararajan: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించే బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందుతుందా? లేదా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చివరిరోజు కావడంతో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆర్టీసీ బిల్లుకు ఓకే చెబుతారా? ఏమైనా అభ్యంతరాలు వెలుబుచ్చుతారా అనే అంశం చర్చనీయాంశంగా. ఆర్టీసీ బిల్లుపై పలు సందేహాలను వ్యక్తం చేసిన గవర్నర్.. రవాణా శాఖ ఉన్నతాధికారులను రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. ఈ మేరకు మధ్యాహ్నం 12గంటలకు రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నతాధికారులు రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ తమిళిసైతో భేటీకానున్నారు. ఈ భేటీలో ఆర్టీసీ బిల్లుపై మరిన్ని వివరాలు అధికారుల నుంచి గవర్నర్ తెలుసుకోనున్నారు. అయితే, అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు గవర్నర్ ఆర్టీసీ విలీనం బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ప్రభుత్వం భావిస్తుంది.

TSRTC Bill : ఆర్టీసీ బిల్లుపై కొనసాగుతున్న సస్పెన్స్.. గవర్నర్ తమిళిసై హాట్ కామెంట్స్

గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్పీకర్‌తో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భేటీ అయ్యారు. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదంముద్ర వేసిన వెంటనే బిల్లును స్పీకర్ అనుమతితో టేబుల్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే, గవర్నర్ సాయంత్రంలోపు బిల్లుకు ఆమోదం తెలిపితే ఇబ్బంది లేదు. కానీ, మరిన్ని సందేహాలను లేవనెత్తుతూ బిల్లును ఆమోదించేందుకు సమయం కావాలని గవర్నర్ కోరితే.. ఏం చేయాలనే అంశంపైనా ప్రభుత్వ వర్గాలు దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.

TSRTC Bill: రాజ్‌భవన్‌లోనే ఆర్టీసీ బిల్లు.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్ పడుతుందా?

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని జూలై 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. మూడో తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే, మనీ బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం తప్పనిసరి. దీంతో మంత్రి వర్గం ఆమోదించిన బిల్లును ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పంపించిన విషయం తెలిసిందే. దీనిపై కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ గవర్నర్ కార్యాలయం వివరణ కోరడం, ప్రభుత్వం సమాధానం ఇవ్వడం, మళ్లీ గవర్నర్ అదనపు సమాచారం కోరవడం, మరోసారి ప్రభుత్వం తన వివరణ పంపడం.. ఇలా రెండు రోజులుగా ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఆర్టీసీ విలీన బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, గవర్నర్ కావాలనే ఆర్టీసీ విలీన బిల్లును అడ్డుకుంటున్నారని ఆర్టీసీ కార్మికులు శనివారం ఛలో రాజ్‌భవన్ నిర్వహించారు. రాజ్‌భవన్ కార్యాలయం ఈ మేరకు వివరణ ఇచ్చింది.

ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల వాంఛను రాజ్ భవన్ అడ్డుకోవడం లేదని, వారికి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రక్రియను పూర్తిచేసేందుకు గవర్నర్ తదుపరి వివరణను కోరారని తెలిపింది. మరోవైపు గవర్నర్ లేవనెత్తిన పలు అంశాలపై సీఎస్ శనివారం సమాధానం ఇచ్చారు. ఆదివారం గవర్నర్‌తో రవాణాశాఖ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. వీరి భేటీ తరువాత గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు