హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జలపాతాలు.. ఈ వర్షాకాలంలో వెళ్తే ఉంటుంది సామిరంగా..

నగరంలోని రహదారుల ద్వారా అక్కడికి తక్కువ సమయంలో చేరవచ్చు.

ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు వర్షాకాలం సరైన సమయం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వాటర్‌ఫాల్స్‌ అందాలు చూడాలనుకుంటున్నారా? మీ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ట్రిప్‌ ప్లాన్‌ చేసుకోండి. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కొన్ని జలపాతాలు ఉన్నాయి. వాటి వివరాలు చూద్దాం..

భువనగిరి వాటర్‌ఫాల్స్‌
హైదరాబాద్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో భువనగిరి సమీపంలో ఈ జలపాతం ఉంటుంది. చుట్టూ ఆకుపచ్చని చెట్లు, పండ్లతో నిండిన కొండలు కనిపిస్తాయి. ఈ ప్రాంతానికి ఎన్‌హెచ్‌ 163 ద్వారా రోడ్ ట్రిప్‌ చేసి చేరుకోవచ్చు.

రాజేంద్రనగర్ వాటర్‌ఫాల్స్‌
హైదరాబాద్‌కు 13.9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నగరానికి అత్యంత సమీపంలో ఉండే ఈ చిన్న వాటర్‌ఫాల్స్‌ ఇది. నగరంలోని రహదారుల ద్వారా అక్కడికి తక్కువ సమయంలో చేరవచ్చు.

Also Read: ఫోన్లంటే ఇలా ఉండాలి.. శాంసంగ్ గెలాక్సీ S25 Edge, ఐఫోన్ 16 Pro Maxలో ఏది బెస్ట్?

కడం డ్యామ్‌ వాటర్‌ఫాల్స్‌
హైదరాబాద్‌కు 107.8 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. కడం డ్యామ్‌ వద్ద ఈ జలపాతం కనిపిస్తుంది. ప్రకృతి అందాలు మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అడ్వెంచర్ లవర్స్, ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్న వారికి ఇది బాగా నచ్చుతుంది. ఎన్‌హెచ్‌ 44 మీదుగా ప్రయాణించి అక్కడికి చేరుకోవచ్చు.

కుంటాల వాటర్‌ఫాల్స్‌
హైదరాబాద్‌కు 564.9 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్‌ జిల్లాలో ఉంటుంది. ఇది తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతం. 200 అడుగుల ఎత్తు నుంచి పడుతుంది. NH44 మార్గం ద్వారా ప్రయాణం చేసి చూడొచ్చు.

ఎత్తిపోతల జలపాతం
హైదరాబాద్‌కు 163.4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చంద్రవంక నదిపై ఈ నీటిపాతం ఉంది. ఎన్‌హెచ్‌ 56 మీదుగా ప్రయాణించి నాగార్జునసాగర్‌ డ్యామ్‌ దిశగా వెళ్లి ఈ జలపాతాన్ని చూడవచ్చు.