×
Ad

Teachers Attendance: బడికి డుమ్మాలు కొడుతున్న టీచర్లు.. ఇకపై అలా చేశారో..

సరైన కారణం లేకుండానే స్కూలుకు టీచర్లు డుమ్మా కొట్టినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు ఉంటాయి.

Teachers Attendance: విద్యార్థులు ప్రతిరోజు స్కూలుకి వచ్చేలా చేయాల్సిన టీచర్లే బడికి డుమ్మాలు కొడుతున్నారు. కనీసం సెలవు చీటిలు కూడా ఇవ్వకుండా టీచర్లు సెలవులు తీసుకుంటుండడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమైంది.

కొందరు టీచర్లు నెలల తరబడి పాఠశాలలకు రాకుండా, పాఠాలు చెప్పకుండా హాయిగా ఇంట్లోనే ఉంటుండడంతో ఇటువంటి వారికి విద్యా శాఖ నోటీసులు ఇస్తుంది. వరుసగా 30 రోజులు పాఠశాలకు రాకపోతే షోకాజ్ నోటీసులను టీచర్ల ఇంటికి పంపిస్తుంది. (Teachers Attendance)

టీచర్ల హాజరుకు సంబంధించిన వివరాలను ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌తో రాబడుతుంది. తెలంగాణలో దాదాపు 1.10 లక్షల మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. వీరికి ఇప్పటికే ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని ప్రారంభించారు.

Also Read: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు అప్పటినుంచే? ఈ సారి విద్యార్థుల ఆందోళన తగ్గించేలా ఇలా..

దీని ఆధారంగా వారి హాజరు వివరాలు విద్యాశాఖకు తెలుస్తాయి. డీఈవోల సమావేశంలో డైరెక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడుతూ.. టీచర్ల హాజరుపై స్పష్టమై ఆదేశాలు ఇచ్చారు. స్కూళ్లకు డుమ్మాలు కొట్టే టీచర్లు వారికి అందే నోటీసులపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు.

సరైన కారణం లేకుండానే స్కూలుకు టీచర్లు డుమ్మా కొట్టినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు ఉంటాయి. మరోవైపు, ఎఫ్ఆర్ఎస్ వచ్చాక టీచర్ల హాజరు శాతం పెరిగినట్లు తెలుస్తోంది. గత రెండేళ్లలో స్కూలుకి సరిగ్గా హాజరుకాని 50 మంది ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగించారు.