Teenmar Mallanna Party: తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తన పార్టీకి ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు.
హైదరబాద్ తాజ్‌కృష్ణ హోటల్‌లో పలువురు బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరును అనౌన్స్ చేశారు మల్లన్న. సెప్టెంబర్ 17వ తేదీ బీసీల తలరాత మారే దినంగా తాను భావిస్తున్నానని తీన్మార్ మల్లన్న చెప్పారు. తెలంగాణలో మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందన్న ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదాలతో పార్టీ ఆవిర్భవించినట్లు మల్లన్న తెలిపారు. వచ్చే అన్ని ఎన్నికల్లో TRP పోటీ చేస్తుందన్నారు.