Telangana : కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు

కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Published on- August 30, 2022 / 01:26 PM IST

TRS MLA Tikonda rajaiah sensational comments on kadiyam srihari

Telangana : మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై టీఆర్ఎస్ నేత..స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్యా ఉప్పు..నిప్పుగా ఉంది. ఇరువురికి ఏమాత్ర పడటంలేదు. ఒకేపార్టీలో ఉన్నా ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈక్రమంలో జనగామ జిల్లాలోని చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో కొత్త పింఛన్‌దారులకు సోమవారం ఆయన కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ..కడియం శ్రీహరిపై మండి పడ్డారు. టీఆర్ఎస్ లోకి రాకముందు కడియం శ్రీహరి టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ మంత్రిగా కూడా పనిచేశారు. ఈక్రమంలో కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో సమయంలో 360 మంది నక్సలైట్లను ఎన్ కౌంటర్ చేయించి పొట్టనపెట్టుకున్నారు అంటూ మండిపడ్డారు. అమాయకులపై నక్సలైట్లు అని ముద్రవేసి పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు తాటికొండ రాజయ్య. అప్పుడు ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే ఇంతమందిని ఎన్‌కౌంటర్ చేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎప్పటికీ తన అడ్డా అని.. అక్కడ ఎవరినీ కాలు పెట్టనీయనిచ్చేది లేదంటూ రాజయ్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కాగా..తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇటీవల కడియం శ్రీహరిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీలతో అభివృద్ధి జరగదని..ఎమ్మెల్యేలతోనే జరుగుతుందని రాజయ్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మరి రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కడియం శ్రీహరి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.