Telangana Assembly Election 2023 : బిర్లామందిర్‌లో రేవంత్ రెడ్డి, భాగ్యలక్ష్మి అమ్మకు కిషన్ రెడ్డి పూజలు

ఇప్పటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన నేతలు దేవాలయాల్లో పూజలు నిర్వహించటంతో బిజీగా ఉన్నారు. తమ పార్టీని గెలిపించాలని పూజలు నిర్వహిస్తున్నారు. తమ పార్టీ గెలవాలని పూజిస్తున్నారు.

Revanth Reddy and Kishan Reddy : ఇప్పటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన నేతలు దేవాలయాల్లో పూజలు నిర్వహించటంతో బిజీగా ఉన్నారు. తమ పార్టీని గెలిపించాలని పూజలు నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇప్పటి వరకు సభలు,సమావేశాలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో ఓటర్లను ఆకర్షించేందుకు పలు యత్నాలు చేసిన నేతలు ఇక భగవంతుడిపై భారం వేశారు. తమపార్టీని గెలిపించాలని దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు.

దీంట్లో భాగంగా రేపు పోలింగ్ తేదీ రావటంతో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బిర్లామందిర్ లో ప్రత్యేక పూజలు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, అంజన్ కుమార్, మల్లు రవి హైదరాబాద్ నగరంలోని బిర్లామందిర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకన్న ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ కార్డు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు.

పోలింగ్‌పై ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా నగర ఓటర్ల ఉదాశీనత.. అత్యల్ప ఓటింగ్

అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాతబస్తీలోని చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సూచించారు.

ఇప్పటి వరకు బీజేపీ, బీఆర్ఎస్,కాంగ్రెస్ విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్ధం చేసుకున్నాయి.ఇక రేపే పోలింగ్ తేది. దీంతో ఆయా పార్టీల నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉండటంతో అధికారులు ఆ దిశగా దృష్టి పెట్టారు. దీంట్లో భాగంగా ఎక్కడిక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు.  అనుమానితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా  రెండు రోజుల క్రితం మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల క్రాస్ వద్ద కారులో డబ్బులు తరలిస్తుండగా వరంగల్ అర్భన్ ఎక్సైజ్ సీఐ అడ్డంగా బుక్ అయ్యారు. సీఐ అంజిత్ రావును ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దీంతో ఈసీ సీఐను సస్పెండ్ చేసింది. ఓ పార్టీకి చెందిన అభ్యర్తి తరపున డబ్బులు పంపకాలు చేశారనే ఆరోపణతో ఈసీ సస్పెండ్ చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు