Urban Voter : పోలింగ్‌పై ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా నగర ఓటర్ల ఉదాశీనత.. అత్యల్ప ఓటింగ్

దేశంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఓటింగుపై నగర ఓటర్లు ఉదాశీనంగా ఉన్నారు. నగర ఓటర్లు పోలింగుపై నిరాసక్తత కారణంగా ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది....

Urban Voter : పోలింగ్‌పై ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా నగర ఓటర్ల ఉదాశీనత.. అత్యల్ప ఓటింగ్

Urban Voters

Telangana Assembly Election 2023 : దేశంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఓటింగ్‌పై నగర ఓటర్లు ఉదాశీనంగా ఉన్నారు. నగర ఓటర్లు పోలింగుపై నిరాసక్తత కారణంగా ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం 40 నుంచి 55 శాతం మధ్య ఉంది. గతంలో నగర ఓటర్లు పోలింగుకు దూరంగా ఉన్న నేపథ్యంలో గురువారం జరగనున్న తెలంగాణ పోలింగులో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎన్నికల అధికారులు ప్రచారం చేస్తున్నారు.

బుధ, గురువారాల్లో అన్ని విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం గురువారం వేతనంతో కూడిన సెలవు ప్రకటించడంతో శుక్రవారం ఒక్కటే పని దినం కావడంతో వారాంతానికి టూర్లకు వెళ్లేందుకు నగరవాసులు మొగ్గుచూపే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల అధికారులు ఓటింగ్ శాతంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నగరవాసులు కొందరు ఇప్పటికే లాంగ్ వీకెండ్ కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.

హైదరాబాద్ ఓటర్లు నవంబర్ 30వతేదీన పోలింగ్ కేంద్రాలకు వచ్చి పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలకు ఉచిత రవాణ సౌకర్యాన్ని కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. అవసరం ఉన్న ఓటర్లకు ఉచిత రవాణ సౌకర్యం కల్పిస్తామని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది.

ALSO READ : పోలింగ్ ముగిసే వరకు పాటించాల్సిన నిబంధ‌న‌లు ఇవే..

ఓటింగ్ రోజున సెలవు ప్రకటించాలని ఇప్పటికే నగరంలోని ఐటీ సంస్థలకు ఈసీ విజ్ఞప్తి చేసింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్లను ఓట్లు వేయమని ప్రోత్సహించేందుకు ఈసీ అధికారులు ప్రచార పోస్టర్లను నగరంలో ప్రదర్శిస్తున్నారు. చాలా ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్‌లోని ఓటర్లను కలిసి ఓటు హక్కును వినియోగించుకోవాలని వీధి కార్నర్ సమావేశాల్లో కోరాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్‌లు, ఓటు హక్కు,దాని ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పోలింగ్ శాతాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ALSO READ : గ్రామాల్లో అత్యధికం.. నగరాల్లో అత్యల్పం.. ఇదీ గత ఎన్నికల్లో ఓటింగ్ తీరు

నగర ఓటర్లకు రాజకీయాలంటే అసహ్య భావం ఉంది. తమకు ప్రభుత్వ మద్ధతు అవసరం లేదనే నగర ఓటర్ల సెంటిమెంటు ఓటింగ్ పట్ల నిరాసక్తతకు దారితీస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పోలింగ్ రోజు సెలవు ప్రకటించాలని ఎన్నికల కమిషన్ అన్ని సంస్థలను కోరింది. కానీ పోలింగ్ రోజు ఇంకా సెలవు ప్రకటించని సంస్థలపై చర్య తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. నగరాల్లోని మధ్యతరగతి జనాభాతో పాటు, అనేక పట్టణ మురికివాడల నివాసితులు వివిధ ప్రభుత్వ పథకాలపై ఆధారపడటం వల్ల వారు ఓటు వేయడానికి ప్రాధాన్యం ఇస్తారు.

ALSO READ : భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు.. యూఎస్ ఎన్ని వీసాలు జారీ చేసిందంటే…

కొందరు ప్రజలు వారు నివసించే నగరాల్లో ఓటర్లుగా నమోదు కాకపోవచ్చు లేదా ఓటర్ల జాబితాలోవారి పేర్లు లేకపోయి ఉండవచ్చు. రెండవది, సేవా రంగంలో పనిచేసే వ్యక్తులు, అటెండర్లు, పనిమనుషులు, హాకర్లు తరచుగా ఓటుకు దూరంగా ఉంటారు. ఎందుకంటే వారికి వారి ఉద్యోగ సంస్థలు సెలవు మంజూరు చేయకపోవచ్చు. కారణాలు ఏవైనా నగరాల్లో పోలింగ్ శాతం మాత్రం తక్కువగా నమోదవుతోంది. దీనివల్ల ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అయినా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ALSO READ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. లక్షమంది పోలీసు సిబ్బందితో భారీ భద్రత

ఎన్నికల అధికారులు చేస్తున్న యత్నాలు ఏ మేరకు సఫలీకృతం అవుతాయో గురువారం జరగనున్న పోలింగ్ పర్వంలో తేలనుంది. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని మలక్ పేట, యాకుత్ పురా, నాంపల్లి, జూబ్లీహిల్స్, చంద్రాయణగుట్ట, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంటు, ఎల్బీ నగర్, చార్మినార్, బహదూర్ పురా సెగ్మెంట్లలో 50 శాతం లోపే పోలింగ్ జరిగింది. ఉప్పల్, సనత్ నగర్, కార్వాన్, ముషీరాబాద్, మల్కాజిగిరి, ఖైరతాబాద్, మహేశ్వరం, సికింద్రాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం 55 శాతం దాటలేదు.