Indian Students : భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు…యూఎస్ ఎన్ని వీసాలు జారీ చేసిందంటే…

అమెరికా దేశంలో చదువుకునేందుకు 1,40,000 మంది భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాలు జారీ చేసింది. భారతదేశంలోని యూఎస్ ఎంబసీ, దాని కాన్సులేట్‌లు 2022వ సంవత్సరం అక్టోబర్ నుంచి 2023వ సంవత్సరం సెప్టెంబర్ మధ్య 1,40,000 స్టూడెంట్ వీసాలు జారీ చేసి ఆల్-టైమ్ రికార్డ్‌ను సాధించాయని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.....

Indian Students : భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు…యూఎస్ ఎన్ని వీసాలు జారీ చేసిందంటే…

US Visas To Indian Students

Indian Students : అమెరికా దేశంలో చదువుకునేందుకు 1,40,000 మంది భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాలు జారీ చేసింది. భారతదేశంలోని యూఎస్ ఎంబసీ, దాని కాన్సులేట్‌లు 2022వ సంవత్సరం అక్టోబర్ నుంచి 2023వ సంవత్సరం సెప్టెంబర్ మధ్య 1,40,000 స్టూడెంట్ వీసాలు జారీ చేసి ఆల్-టైమ్ రికార్డ్‌ను సాధించాయని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. 2022వ సంవత్సరం అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు యూఎస్ ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసి రికార్డు సాధించిందని యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ పేర్కొంది.

ALSO READ : Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం.. బరిలో 2,290 మంది అభ్యర్ధులు

అమెరికా రాయబార కార్యాలయం వ్యాపారం, పర్యాటకం కోసం 8 మిలియన్ల సందర్శకుల వీసాలను జారీ చేసింది.ఎంబసీ ,కాన్సులేట్‌లు 600,000 కంటే ఎక్కువ విద్యార్థి వీసాలను జారీ చేశాయి. ప్రయాణీకులు దౌత్యకార్యాలయం లేదా కాన్సులేట్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా వారి వీసాలను పునరుద్ధరించడానికి అనుమతించే ఇంటర్వ్యూ మినహాయింపు అధికారాలను విస్తరించడం వంటి వినూత్న చర్యల కారణంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయని యూఎస్ ప్రకటన పేర్కొంది.

ALSO READ : Today Headlines : రేపే తెలంగాణ ఎన్నికల పోలింగ్‌.. ఎన్నికల ప్రక్రియను కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్న ఈసీ..

యూఎస్ మిషన్ టు ఇండియా 2023లో ఒక మిలియన్ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలనే లక్ష్యాన్ని చేరుకుంది. గత సంవత్సరం 1.2 మిలియన్లకు పైగా భారతీయులు యూఎస్‌ని సందర్శించారని, ఇది ప్రపంచంలోని అత్యంత బలమైన ప్రయాణ సంబంధాల్లో ఒకటిగా నిలచిందని యూఎస్ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీసా దరఖాస్తుదారులలో భారతీయులు 10 శాతానికి పైగా ఉన్నారు. భారతదేశంలోని యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి ఢిల్లీలోని యూఎస్ మిషన్‌ను సందర్శించి భారతీయుల యూఎస్ విజిటర్ వీసాల డిమాండును పరిశీలించారు.