Telangana Exit Poll Result 2023 : తెలంగాణలో గెలిచేది ఈ పార్టీనే..! ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సాధిస్తారా? తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్‌కు ఓటు వేశారా‎?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైంది. డిసెంబర్ 3న ఫలితం వెలువడనుంది. ఈసారి ఓటరు దేవుడు ఎవరికి పట్టం కట్టాడు? ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అన్నది తెలియాలంటే డిసెంబర్ 3వరకు ఆగాల్సిందే.

తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సాధిస్తారా? తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్‌కు ఓటు వేశారా‎? పోరుగడ్డలో బీజేపీ గెలవబోతున్న స్థానాలెన్ని‎? ప్రజా తీర్పు ఏ విధంగా ఉండనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి.

ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే.. కొన్ని సంస్థలు బీఆర్ఎస్ దే గెలుపు అని అంచనా వేయగా, మరికొన్ని సంస్థలు కాంగ్రెస్ విజయం ఖాయమంటున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రం కాంగ్రెస్ కి జై కొట్టాయి. ఈసారి కాంగ్రెస్ దే అధికారం అంటున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..

సీఎన్ఎన్-న్యూస్ 18
బీఆర్ఎస్ 48
కాంగ్రెస్+ 56
బీజేపీ+ 10
ఎంఐఎం 05

థర్డ్ విజన్ ఎగ్జిట్ పోల్..
బీఆర్ఎస్ 61-68
కాంగ్రెస్+ 34-10
బీజేపీ+ 03-05
ఇతరులు 05-08

సర్వే సంస్థ – పొలిటికల్ గ్రాఫ్
బీఆర్ఎస్ – 68
కాంగ్రెస్+ – 38
బీజేపీ+ – 05
ఇతరులు – 08

సర్వే సంస్థ – ఆత్మ సాక్షి
బీఆర్ఎస్ – 58-63
కాంగ్రెస్+ – 48-51
బీజేపీ – 07-08
ఇతరులు – 07-09

Telangana Exit Poll Result 2023 Update

సర్వే సంస్థ .. పీపుల్స్‌ పల్స్‌- సౌత్‌ఫస్ట్‌
బీఆర్ఎస్ – 35-46
కాంగ్రెస్+ – 62-72
బీజేపీ+ – 3-8
ఎంఐఎం – 6-7
ఇతరులు 1-2

పీపుల్స్‌ పల్స్‌- సౌత్‌ఫస్ట్‌ ఓటింగ్ షేర్ వివరాలు
బీఆర్‌ఎస్‌ – 37.8 శాతం
కాంగ్రెస్‌ పార్టీ – 42.7 శాతం
బీజేపీ – 13.2 శాతం
ఎంఐఎం – 2.5 శాతం ఓట్లు సాధించే అవకాశం

ఆరా ప్రీ పోల్ సర్వే..
బీఆర్ఎస్- 41 నుంచి 49 సీట్లు
కాంగ్రెస్+- 58 నుంచి 67 సీట్లు
బీజేపీ+- 5 నుంచి 7 సీట్లు
ఇతరులు- 7 నుంచి 9 సీట్లు

ఓట్ షేర్ వివరాలు..
బీఆర్ఎస్ – 39.58శాతం
కాంగ్రెస్+ – 41.13 శాతం
బీజేపీ+ – 10.47 శాతం
ఇతరులకు – 8.82శాతం

సర్వే సంస్థ – జన్ కీ బాత్
బీఆర్ఎస్ – 42-55
కాంగ్రెస్+ – 48-64
బీజేపీ+ 07-13
ఎంఐఎం – 04-07

సర్వే సంస్థ- CSDP
బీఆర్ఎస్ – 78
కాంగ్రెస్+ – 28
బీజేపీ+ 05
ఎంఐఎం – 07
ఇతరులు – 01

సర్వే సంస్థ – కేస్ స్టడీస్
బీఆర్ఎస్ – 29
కాంగ్రెస్+ – 70
బీజేపీ+ 13
ఎంఐఎం – 06-07
ఇతరులు – 00

సర్వే సంస్థ – HMR
బీఆర్ఎస్ – 63
కాంగ్రెస్+ – 45
బీజేపీ+ 05
ఎంఐఎం – 07
ఇతరులు – 00

సర్వే సంస్థ – చాణక్య స్ట్రాటజీస్
బీఆర్ఎస్ – 22-30
కాంగ్రెస్+ – 67-78
బీజేపీ+ 06-09
ఎంఐఎం – 06-07
ఇతరులు – 00

సర్వే సంస్థ – రిపబ్లిక్ టీవీ
బీఆర్ఎస్ – 46-56
కాంగ్రెస్+ – 58-68
బీజేపీ+ 04-09
ఎంఐఎం – 05-07
ఇతరులు – 01

 

ట్రెండింగ్ వార్తలు