Telangana Assembly Election 2023 : తెలంగాణలో ఇంటి వద్దే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో హోం ఓట్ల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ కొత్తగా పన్నెండు వర్గాలకు ఇంటి నుంచి ఓటేసే విధానాన్ని ప్రారంభించింది. 80 ఏళ్ల వయసు పైబడినవారు, దివ్యాంగులు, నడవలేని వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు.....

Home voting process

Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో హోం ఓట్ల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ కొత్తగా పన్నెండు వర్గాలకు ఇంటి నుంచి ఓటేసే విధానాన్ని ప్రారంభించింది. 80 ఏళ్ల వయసు పైబడినవారు, దివ్యాంగులు, నడవలేని వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. వృద్ధులు, దివ్యాంగులు ముందుగా ఫారం డి-12 సమర్పిస్తే ఇంటి నుంచి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారికి బీఎల్ఓ సిఫార్సు చేస్తారు.

ఇంటి వద్దే ఓటుకు శ్రీకారం

గతంలో వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్ కేంద్రానికి వీల్ ఛైర్లపై, లేదా భుజాన ఎత్తుకొని మోసుకువచ్చి ఓటు వేయించేవారు. కానీ ఈ సారి ఇంటి నుంచే ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతించింది. తెలంగాణలో నవంబర్ 30వతేదీన పోలింగ్ తేదీ కాగా ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, దివ్యాంగులకు అనుమతించారు. తెలంగాణలో 28,057 మంది ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతించారు.

ALSO READ : Anushka Sharma : భర్త కోహ్లీని ఓదార్చిన అనుష్క శర్మ…వైరల్ చిత్రం

పోలింగ్ సిబ్బంది, ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటు వేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేశాక వాటిని పోలింగ్ సిబ్బంది సేకరించి తీసుకువెళతారు. ముందుగా సమాచారం అందించి ఓటు వేయించేందుకు పోలింగ్ సిబ్బంది ఇళ్లకు వస్తున్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన అధికారి సమక్షంలో ఓటు వేయించుకొని దాన్ని పోలింగ్ కేంద్రాలకు పంపాలి. ఇంటి నుంచి ఓటేసే ప్రక్రియ తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చురుకుగా సాగుతోంది.

ALSO READ : Leopard : జనవాసాల్లోకి వస్తున్న చిరుతపులులు… మళ్లీ బెడ్రూంలోకి వచ్చిన చిరుతపులి

వీరితో పాటు ఎన్నికల విధులు నిర్వర్తించే 3.6 లక్షలమంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వనున్నారు. గతంలో పోస్టల్ బ్యాలెట్ పత్రాలను తమతోపాటు ఇంటికి తీసుకువెళ్లి ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 8 గంటల లోపు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు అప్పగించేవారు. ఈసారి అలా కాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, అధికారులు ఫెసిలిటేషన్ సంటరులోనే పోస్టల్ ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే ముందు ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటరులోనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసి వెళ్లాలి.

ట్రెండింగ్ వార్తలు