Telangana Assembly Passed 8 Bills : తెలంగాణ అసెంబ్లీలో 8 బిల్లులు, రెండు తీర్మానాలకు ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్‌ పన్నుల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకు ఓకే చెప్పింది. రెండు తీర్మానాలు ఆమోదం పొందాయి. మూడు ముఖ్యమైన అంశాలపై స్వల్పకాల చర్చలు జరిగినట్టు మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Telangana Assembly

Telangana Assembly Passed 8 Bills : తెలంగాణ అసెంబ్లీ 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్‌ పన్నుల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకు ఓకే చెప్పింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులకు ఆమోదం లభించింది.

అజమాబాద్‌ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సూపరెన్యుయేషన్ సవరణ బిల్లులకు శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అసెంబ్లీ మూడు రోజుల సమావేశాల్లో 11 గంటలు శాసన సభ, 11గంటల 42 నిమిషాలు శాసన మండలి పనిచేశాయి. రెండు తీర్మానాలు ఆమోదం పొందాయి.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో .. పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు

ఇందులో ఒకటి కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరుపెట్టాలని, మరొకటి కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ తీర్మానం చేశారు. మూడు ముఖ్యమైన అంశాలపై స్వల్పకాల చర్చలు జరిగినట్టు మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇక సభలో మొత్తం 6 గంటల 3 నిమిషాలు ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడారు.