Telangana Assembly
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. ఈనెల 14 వరకు సమావేశాలు వాయిదా పడ్డాయి.
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. ఈనెల 14 వరకు సమావేశాలు వాయిదా పడ్డాయి. మళ్లీ పున: ప్రారంభమైన తొలిరోజు శాసన సభాపతిని ఎన్నుకుంటారు. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు.
మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలలో మొదటి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి
అసెంబ్లీలో మంత్రులు తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. భట్టి విక్రమార్క(ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం) చేయగా..
దాసరి అనసూయ (పవిత్ర హృదయం సాక్షిగా ప్రమాణం) ప్రమాణ స్వీకారం చేశారు. దామోదర రాజనర్సింహ (ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం), శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులు తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు.
ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మొదటి ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టిన 51 మంది ఎమ్మెల్యేలు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు, అసెంబ్లీ కార్యదర్శి నర్సిహ్మ చార్యులు.
అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు
అసెంబ్లీ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. అక్బరుద్దీన్ ఎదుట ఎమ్మెల్యేలుగా ప్రమాణ చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు నిరాకరించారు.
అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పాసులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ లోపలికి అనుమతిస్తున్నారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీకి నాలుగు కిలో మీటర్ల పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
మరికొద్ది సేపట్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ వారితో ప్రమాణం చేయిస్తారు.
బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం ఎంపిక అధికారాన్ని బీఆర్ఎస్ ఎల్పీ నేతకు కట్టబెడుతూ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.
తెలంగాణ భవన్ నుంచి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలు దేరారు. అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించి అసెంబ్లీ కి వెళ్లనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్బరుద్దీన్ చే ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావులు పాల్గొన్నారు.