Telangana Assembly Sessions : రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతిస్తారా, లేదా ?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగబోతున్నాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యేల్ని అసెంబ్లీలోకి రానిస్తారా, లేదా అనే ఉత్కంఠ నెలకొంది. గత అసెంబ్లీ సెషన్స్‌లో బీజేపీ ఎమ్మెల్యేల్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్‌ చేశారు. అప్పటి సెషన్స్‌ ముగిసేవరకూ సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Telangana assembly sessions

Telangana assembly sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగబోతున్నాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యేల్ని అసెంబ్లీలోకి రానిస్తారా, లేదా అనే ఉత్కంఠ నెలకొంది. గత అసెంబ్లీ సెషన్స్‌లో బీజేపీ ఎమ్మెల్యేల్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్‌ చేశారు. అప్పటి సెషన్స్‌ ముగిసేవరకూ సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సభను ప్రొరోగ్ చేయకపోవడంతో ఈసారి అసెంబ్లీలోకి బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతిస్తారా, లేదా అన్న ఉత్కంఠ ఏర్పడింది.

సభను ప్రొరోగ్ చేయకపోవడంతో అసెంబ్లీలోకి బీజేపీ ఎమ్మెల్యేల ఎంట్రీపై చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్‌లో 8వ సెషన్ అంటూ ప్రకటన చేశారు. థర్డ్ సీటింగ్ ఆఫ్‌ ఎయిత్‌ సెషన్ ఆఫ్ సెకండ్‌ తెలంగాణ అసెంబ్లీ అంటూ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గత సెషన్‌కు కొనసాగింపుగానే తాజా సమావేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6 నుంచి.. సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ తీర్మానం చేసే ఛాన్స్

బీజేపీ ఎమ్మెల్యేలకు అనుమతిపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని అసెంబ్లీ వర్గాలు అంటున్నాయి. మరోపక్క బీజేపీ మాజీ ఫ్లోర్‌ లీడర్ రాజాసింగ్‌ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ కొత్త ఫ్లోర్ లీడర్‌ను ఎంపిక చేస్తుందా..? లేదా ఎల్పీలీడర్ లేకుండానే సభకు వస్తారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.