Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి ఆదివారం (ఫిబ్రవరి12, 2023) ముగియనున్నాయి. చివరి రోజైన నేడు (ఆదివారం) ద్రవ్యి వినిమయ బిల్లు అసెంబ్లీ ముందుకు రానుంది.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి ఆదివారం (ఫిబ్రవరి12, 2023) ముగియనున్నాయి. చివరి రోజైన నేడు (ఆదివారం) ద్రవ్యి వినిమయ బిల్లు అసెంబ్లీ ముందుకు రానుంది. ఈ నెల 6న సభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టాక.. శాఖల వారిగా బడ్జెట్ డిమాండ్లు, గ్రాంట్లపై చర్చలు జరిగాయి. నిన్న (శనివారం) ఏకంగా 13 గంటలకు పైగా సభలో పద్దులపై చర్చ జరిగింది.

అర్ధరాత్రి వరకు సభ నడిచింది. 2023-24 ఆర్థిక సంవత్సారానికి పలు పద్దులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. చివరి రోజైన ఇవాళ (ఆదివారం) మరికొన్ని పద్దులకు శాసనసభ ఆమోదం తెలపనుంది. ద్రవ్య వినిమయ బిల్లు శాసనసభలో ఆమోదం పొందాక శాసన మండలిలో ప్రవేశపెడతారు.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో ఈటల, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర సన్నివేశం..

మరోవైపు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాశ్ ముదిరాజ్ ఎన్నిక ప్రక్రియను ఇవాళ(ఆదివారం) పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత మండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాశ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్బంగా నిన్న రాత్రి సభలో ప్రతిపక్ష సభ్యులు లేకపోవడాన్ని శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తప్పుబట్టారు.

సీట్లన్నీ ఖాళీగా కనిపించడంతో ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. ప్రజా సమస్యలు, పద్దులపై ముఖ్యమైన చర్చ జరుగుతుంటే కనీసం ఒక్క ప్రతిపక్ష సభ్యుడు కూడా లేరని అని అన్నారు. ప్రజలపై ప్రతిపక్షాలకు ఉన్న ఇంట్రెస్టు ఇదేనా అని నిలదీశారు. ఇది చాలా అన్యాయమని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు