Jitender Reddy : జితేందర్ రెడ్డి మరో ట్వీట్ .. ఈ సారి గొర్రెలు పోటీ పడుతున్న వీడియో

జితేందర్ రెడ్డి తాజాగా పెట్టిన వీడియో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గొర్రెలు పోటీ వీడియోతో మరోసారి బీజేపీ నేత దుమారం రేపారు.

BJP Leader Jitender Reddy Tweet

BJP Leader Jitender Reddy Tweet : మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి (Jitender Reddy)మరో ట్వీట్ (Tweet)పెట్టారు. కొన్ని రోజుల క్రితం బర్రెలను తన్నిన వీడియో పెట్టిన ఆయన తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. బీజేపీ కొత్త అధ్యక్షుల్ని నియమిస్తున్న క్రమంలో జితేందర్ రెడ్డి తాజాగా పెట్టిన వీడియో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో ఓ బ్లూ కలర్ స్టూల్ ఉంది. దాని కలర్ ఇక్కడ ముఖ్యం కాదు. ఆ స్టూల్ మీద నిలబడేందుకు కొన్ని గొర్రె పిల్లలు పోటీ పడుతున్నాయి. ఒక గొర్రెపిల్ల దానిమీదకు ఎక్కింది.. అక్కడే ఉన్నమరో కొన్ని గొర్రెపిల్లలు కూడా ఆ స్టూల్ ఎక్కేందుకు యత్నిస్తు..ముందు ఎక్కిన గొర్రెపిల్లను తోసేయటం చేస్తుంటాయి. ఈ వీడియోను జితేందర్ రెడ్డి పోస్ట్ చేశారు.

Jithender Reddy : బీజేపీ నేత జితేందర్ రెడ్డి మరో ట్వీట్.. ఈసారి రఘునందన్ పేరు ప్రస్తావన

2024 సాధారణ ఎన్నికల కోసం ప్రతి పక్షాల ప్రధాని అభ్యర్థి అంటూ కామెంట్ కూడా చేశారు జితేందర్ రెడ్డి. తాజాగా ఆయన చేసిన ఈ వీడియో మరోసారి హాట్ టాపిక్ గా మారింది…ఇలా ఆయన పోస్ట్ చేసే ట్వీట్లతో హాట్ టాపిక్ గా మారారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నారు.

కొన్ని రోజుల క్రితం ఓ గేదే తోకను పట్టుకుని వెనక తన్నుతూ టక్కులోకి ఎక్కిస్తున్న వీడియోను ట్వీట్ చేస్తూ… బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ట్వీట్ కాస్తా తెలంగాణ బీజేపీలో దుమారం రేపింది. ఈటల దానికి కౌంటర్ కూడా ఇచ్చారు. ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ ట్వీట్ చేశారు అన్నది తీవ్ర చర్చనీయాశంగా మారింది. కాగా.. ఇప్పుడు మరో ట్వీట్ తో జితేందర్ రెడ్డి పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.