Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు .. 40మందితో క్యాంపైనర్ల లిస్టులో తెలుగువారికి చోటు

కర్ణాటక ఎన్నికల క్యాంపెయిన్ లిస్టులో తెలుగు బీజేపీ నేతలు పాల్గొననున్నారు. దక్షిణాదిలో అధికారం కోసం కర్ణాటకలో సత్తా చాటాలని చూస్తోంది బీజేపీ. తద్వారా తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని ప్లాన్ వేస్తోంది.

Karnataka Elections 2023 TS BJP leaders

Karnataka Elections 2023 : కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కర్ణాటక ఎన్నికల హడావిడి తెలంగాణలోకూడా కనిపిస్తోంది. ఎందుకంటే కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు క్యూ కడుతున్నారు. బీజేపీ అధిష్టానం కర్ణాటక ఎన్నికల ప్రచారానికి 40మందితో క్యాంపెయినర్లను ప్రకటించింది. ఈ లిస్టులో తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఉన్నారు.దీంతో కన్నడ నాట ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు తరలివెళ్లనున్నారు. ఈ ప్రచారానికి బీజేపీ అగ్రనేతలతో పాటు ఏపీ, తెలంగాణల నుంచి కూడా నేతలను అధిష్టానం లిస్టులో చేర్చింది. ప్రధాని మోదీ సహా.. స్టార్ క్యాంపైనర్స్ జాబితాలో జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, యోగీ, నిర్మలా, స్మృతీ ఇరానీ, డీకే అరుణ తదితరులు ఉన్నారు.

జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి మాజీమంత్రి డీకే అరుణకు అవకాశం దక్కింది. అలాగే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు, వివేక్, జితేందర్ రెడ్డి, గరికపాటి, ఇంద్రసేనారెడ్డి, ఎస్.కుమార్ లకు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో క్యాంపెయినింగ్ బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. కర్ణాటకలో తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించటానికి తెలుగు రాష్ట్రాల నుంచి నేతలను ఎన్నుకుంది బీజేపీ అధిష్టానం. దీంట్లో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ఉన్నారు. కర్ణాటకలో మరోసారి అధికారం సాధించే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్రణాళికల్లో భాగంగా తెలుగువారు ఉండే ప్రాంతాల్లో తెలుగు నేతలతోనే క్యాంపెయినింగ్ నిర్వహించాలని భావించింది.

Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అతిరథ మహారథులు .. బీజేపీ క్యాంపెయినర్ల లిస్టు విడుదల

అంతేకాకుండా కర్ణాటకలో అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ ఈజీగా గెలుస్తామంటోన్న బీజేపీ తెలుగు వారితో కర్ణాటకలో క్యాంపెయినింగ్ నిర్వహిస్తోంది. పాత హైదరాబాద్ సంస్థానం.. ప్రస్తుత కర్ణాటకలో ఫోకస్ పెంచిన బీజేపీ నేతలు
ఇలా పక్కా ప్లాన్స్ తో ముందుకెళుతోంది. దీంట్లో భాగంగానే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొననుండగా..బీదర్ లో జరిగిన అమిత్ షా సభలో పాల్గొన్న బండి సంజయ్, ఈటల, వివేక్
పాల్గొన్నారు. అలా అధిష్టానం డైరెక్షన్ లో కర్ణాటక ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. దక్షిణాదిలో కర్ణాటకతో పాటు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది బీజేపీ అగ్ర నాయకత్వం కర్ణాటకలో విజయం సాధిస్తే ఇప్పటికే ఫోకస్ తెలంగాణ అనేలా బీజేపీ దూకుడు కొసాగుతోంది.

 Karnataka Election 2023: బీజేపీ మూడో జాబితా రిలీజ్.. ఆ మూడు స్థానాల్లో నేతల కుటుంబ సభ్యులకే ఛాన్స్ ..