TS Budget 2022-23 : ప్రభుత్వ ఖజానాకు ఎంత ధనం వచ్చిందనేది కాదు..అది ప్రజలకు ఎంతవరకు చేరంది అనేది ముఖ్యం

ప్రభుత్వ ఖజానాకు ఎంత ధనం వచ్చిందనేది కాదు..అది ప్రజలకు ఎంతవరకు చేరంది అనేది ముఖ్యం అని మంత్రి హరీశ్ రావు బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో అన్నారు.

TS Budget 2022 : ప్రభుత్వ ఖజానాకు ఎంత ధనం వచ్చిందనేది కాదు ముఖ్యం..అది ప్రజలకు ఎంతవరకు చేరంది అనేది ముఖ్యం అని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి హరీశ్ రావు అన్నారు. శాసనసభలో మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా మంత్రి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. దీంట్లో భాగంగా మంత్రి తెలంగాణ కొత్త రూపం సంతరించుకుంది అని తెలిపారు. తెలంగాణను పునర్నిర్మించే బాధ్యతను కేసీఆర్ భుజాలపై వేసుకున్నారని..గతంలో లాగా ఇప్పుడు తెలంగాణ లేదని..అభివృద్దిలో దూసుకుపోతోందని అని తెలిపారు.

Also read : Dalitha Bandhu : వచ్చే సంవత్సరానికి 2 లక్షల మందికి దళిత బంధు.. రూ. 17, 700 కోట్లు కేటాయింపు

గతంలో వేసవి వచ్చిందంటే చాలు కరెంట్ కోతలు ఉండేవని ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. గత పాలకు హయాంలో తెలంగాణలో ఆకలి చావులు ఉండేవనీ..ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నాం..రైతులు చక్కగా పంటలు పండిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఆకలి చావులు అనే మాటే లేదని అన్నారు. సమైక్య పాలనలో చీకటి రోజుల్ని ఇప్పుడు తలచుకుంటే ఒళ్లు గగొర్పొడుతోందని కానీ అన్ని కష్టాలను అధిగమించి స్వరాష్ట్రం సాధించుకున్నాక టీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎన్నో అభివృద్దిపనులు చేస్తున్నామని అన్నారు.

Also read : Minister Harish Rao : తెలంగాణ అసెంబ్లీ.. బడ్జెట్ సెషన్ మొత్తం బీజేపీ సభ్యుల సస్పెండ్

తెలంగాణ భారత్ లో అగ్రగామిగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందన్నారు. రైతుబంధు, ఆసరా.. ఇలా ఏ పథకమైనా నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తోందని హరీశ్ తెలిపారు. కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవని చెప్పారు. దేశంలో తెలంగాణ ఓ టార్చ్ బేరర్ అని చెప్పారు. ఖజానాకు ఎంత ధనం చేరిందనేది ముఖ్యం కాదని… ప్రజలకు ఎంత మేలు జరిగిందనేదే ముఖ్యమని అన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదని విమర్శించారు. తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పటి నుంచే కేంద్రం దాడి మొదలైందని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.

ట్రెండింగ్ వార్తలు