Telangana Cabinet : తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖ దక్కిందంటే?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతో పాటు 10మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Telangana Cabinet

Telangana New Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతో పాటు 10మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంపై శుక్రవారం సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో శాఖల కేటాయింపుపై స్పష్టత రావడంతో శనివారం ఉదయం మంత్రులకు శాఖలను కేటాయించారు.

Also Read : CM Revanth Reddy : సీనియర్లకు కీలక శాఖలు..! ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు

భట్టి విక్రమార్క – ఆర్థిక శాఖ, ఇంధన శాఖ
తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయ శాఖ, చేనేత శాఖ
శ్రీధర్ బాబు – ఐటీ, పరిశ్రమ, శాసనసభ వ్యవహారాలు
ఉత్తమ్ కుమార్ రెడ్డి – సివిల్ సప్లయ్, భారీ నీటిపారుదల
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ
పొన్నం ప్రభాకర్ – రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ
సీతక్క – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (రూరల్ వాటర్ సప్లయ్), మహిళ, శిశు సంక్షేమ శాఖ
దామోదర రాజనర్సింహ – వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ
కొండా సురేఖ – అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖ
జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్ శాఖ, పర్యాటక శాఖ

ట్రెండింగ్ వార్తలు