Telangana Cabinet Meeting: బడ్జెట్ ప్రతిపాదనలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం.. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్?
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని ఆయన అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
- T Venkateshwarlu
- Published On : February 5, 2023 / 12:22 PM IST
CM KCR
Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని ఆయన అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టనుందని ఊహాగానాలు వస్తున్నాయి. కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం, టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్, దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించాలని ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ కు అధిక ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు అధిక కేటాయింపులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ కు బయలుదేరారు. ఇవాళ ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ వెలుపల బీఆర్ఎస్ నిర్వహిస్తున్న తొలి సభ ఇది. సభ కోసం భారీగా జనాలను తరలిస్తున్నారు.
Musharraf passes away: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
