Musharraf passes away: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ జనరల్ ఫర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అమెరికన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Musharraf passes away: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత

Pervez Musharraf

Musharraf passes away: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ జనరల్ ఫర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. అమిలోయిడోసిస్ వ్యాధితో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అమెరికన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ముషారఫ్ మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించినట్లు పాక్ మీడియా పేర్కొంది.

Musharraf: పాకిస్తాన్‌కు ముషారఫ్.. ఏర్పాట్లు చేస్తున్న ఆర్మీ

ముషారఫ్ 11 ఆగస్టు 1943న ఢిల్లీలో జన్మించారు. భారత్, పాకిస్థాన్ విభజనకు కొద్దిరోజుల ముందు 1947లో అతని కుటుంబం పాకిస్థాన్ వెళ్లిపోయింది. ముషారఫ్ తండ్రి పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. ముషారఫ్ విద్యాభ్యాసం కరాచీలోనే జరిగింది. సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో తన ప్రాథమిక విద్యను అభ్యసించాడు. లాహోర్‌లోని క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు.  ముషారఫ్ తండ్రికి ఉద్యోగ నిమిత్తం టర్కీ బదిలీ అయింది. దీంతో ముషారఫ్ తన కుటుంబంతో కలిసి 1949 నుంచి 1957 వరకు టర్కీలోనే ఉన్నాడు.

లాడెన్ మా హీరో…ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు

1961లో 18ఏళ్ల వయస్సులోనే ముషారఫ్ కాకుల్‌లోని పాకిస్థాన్ మిలటరీ అకాడమీలో జాయిన్ అయ్యాడు. ఆ తరువాత సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగి పాకిస్థాన్ జనరల్  స్థాయికి చేరుకున్నాడు. కార్గిల్ యుద్ధానికి ముషారఫ్ ప్రధాన కారకుడు. ముషారఫ్ 1999‌లో నవాజ్ షరీఫ్ సర్కార్‌పై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పగ్గాలు చేపట్టాడు. రెండేళ్ల తరువాత 2001లో పాకిస్థాన్ అధ్యక్షుడిగా ముషారఫ్ బాధ్యతలు చేపట్టాడు. 2008 వరకు సుదీర్ఘకాలం పాకిస్థాన్ ప్రధానిగా ముషారఫ్ కొనసాగాడు.

Pervez Musharraf : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్యం విషమం

2007 నవంబర్ 3న పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ విధించినందుకు, డిసెంబర్ 2007 మధ్యకాలం వరకు రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు 2013 డిసెంబర్‌లో పర్వేజ్ ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది.  2019 డిసెంబర్ నెలలో పెషావర్ హైకోర్టు ముషారఫ్‌కు మరణశిక్ష విధించింది. మరణ శిక్ష విధించడం పాక్ చరిత్రలో తొలిసారి.  అయితే, ముషారఫ్ కు విధించిన మరణశిక్షను సంవత్సరం తరువాత లాహోర్ హైకోర్టు కొట్టేసింది. ఇదిలాఉంటే 2016లోనే ముషారఫ్ పాక్‌ను వదిలి వెళ్లిపోయాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ముషారప్‌ను అతని కుటుంబ సభ్యులు 2016లో చికిత్స నిమిత్తం దుబాయ్ తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముషారఫ్ పాకిస్థాన్ లో అడుగు పెట్టలేదు. ఆదివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముషారఫ్ తుదిశ్వాస విడిచారు.