లాడెన్ మా హీరో…ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : November 14, 2019 / 07:49 AM IST
లాడెన్ మా హీరో…ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు

పాక్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి కశ్మీరీలు పాకిస్తాన్‌లో శిక్షణ పొందారని ఆయన అంగీకరించారు. ఎప్పుడూ మాట్లాడిందో తెలియని ముషారఫ్ ఇంటర్వ్యూ క్లిప్ ను పాకిస్తాన్ రాజకీయ నాయకుడు ఫర్హతుల్లా బాబర్ బుధవారం ట్విట్టర్ లో షేర్ చేశారు. 

ఆ వీడియోలో ముషార్రఫ్…1979లో పాకిస్తాన్ ప్రయోజనం కోసం ఆఫ్గనిస్తాన్ లో మత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాం. ప్రపంచం నలుమూలల నుంచి ముజాహిదీన్‌లను తీసుకువచ్చి వారికి శిక్షణ ఇచ్చి, ఆయుధాలు కూడా సరఫరా చేశాం. హక్కానీ, ఒసామా బిన్‌ లాడెన్ లు మా హీరోలు అని వీడియో క్లిప్‌లో ముషారఫ్ అన్నట్లు కన్పిస్తోంది.

పాక్ కు వచ్చిన కశ్మీరీలకు తాము శిక్షణ ఇచ్చి, మద్ధతు ఇచ్చాం. మేము వారిని భారత సైన్యంతో పోరాడే ముజాహిదీన్ గా భావించాము. అప్పుడు, లష్కరే తోయిబా వంటి వివిధ ఉగ్రవాద సంస్థలు ఈ కాలంలో పెరిగాయి. వారు (జిహాదీ ఉగ్రవాదులు) మా వీరులు అని ముషారష్ అన్నారు. జమ్మూకశ్మీర్‌లో పాక్ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేందుకు ఉగ్రవాదులను ఉపయోగిస్తోందనడానికి ముషారఫ్ వీడియో క్లిప్ సాక్ష్యంగా నిలిచింది.