×
Ad

Telangana Cabinet : ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ సమావేశం..కీలక అంశాలపై చర్చ

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆదివారం (ఆగస్టు 1, 2021) జరుగనుంది. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది.

  • Published On : July 30, 2021 / 09:27 PM IST

Telangana

Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆదివారం (ఆగస్టు 1, 2021) జరుగనుంది. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా దళిత బంధు, చేనేత బీమా, దళిత బీమా పథకాలు, కరోనా థర్డ్ వేవ్ పై చర్చించనున్నారు.

హుజూరాబాద్ అభివృద్ధిపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, పంట నష్టం, వ్యవసాయం, ఇరిగేషన్ పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక కరోనా థర్డ్ డేవ్ వస్తుందన్న నేపథ్యంలో ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ చర్చించనుంది. కొత్త ఆస్పత్రుల నిర్మాణ పనులపై మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది.

హుజూరాబాద్ కు సంబంధించి అభివృద్ధి పనులకు ఇప్పటికే ప్రభుత్వం రూ.42 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రత్యేకంగా హుజూరాబాద్ జరుగలేదు. గతంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ బర్తరఫ్, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ అంశాలను కూడా అంతర్గతంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.