Telangana Cabinet Decisions : తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. ఆ 5 ఆర్డినెన్స్ లకు ఆమోదం

ఆర్వోఆర్ చట్టంపైనా మంత్రి మండలిలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.

Telangana Cabinet Decisions : తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సుదీర్ఘంగా 4 గంటల పాటు కొనసాగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేసింది. 5 ఆర్డినెన్స్ లకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రైతుభరోసా అంశంపై క్యాబినెట్ లో చర్చ జరిగింది. సంక్రాంతి నుంచి రైతుభరోసా అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ఆర్వోఆర్ చట్టంపైనా మంత్రి మండలిలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.

క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
* పంచాయతీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు క్యాబినెట్ ఆమోదం
* స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం