ఎన్నికల వేళ నగదు, బంగారం తీసుకెళ్తున్నారా..? సీఈవో వికాస్ రాజ్ ఏం చెప్పారంటే

అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు 780 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారంను ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసిందని వికాస్ రాజ్ చెప్పారు.

Telangana CEO Vikas Raj

CEO Vikas Raj : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెప్పారు. 10టీవీతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్నిచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఇబ్బందులు జరిగాయని, అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ఏరియాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువ నమోదైందని అన్నారు. తెలంగాణలో సుమారు ఐదు వేల పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ తక్కువగా నమోదైందని, ఈసారి ఓటర్లలో అవగాహన కల్పించడంకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా అర్బన్ ఏరియాల్లో పోలింగ్ శాతం పెరగకపోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు.

Also Read : CM Revanth Reddy : బిడ్డా గుర్తు పెట్టుకో.. నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని- కేసీఆర్ పై నిప్పులు చెరిగిన సీఎం

అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు 780 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారంను ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసిందని వికాస్ రాజ్ చెప్పారు. ఇదంతా 20 డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో మానిటరింగ్ జరుగుతుందని తెలిపారు. గతంలో కేసులు, ఎఫ్ఐఆర్ ఉన్న నేతలపై సీరియస్ ఫోకస్ ఉంటుందని అన్నారు. ఎంసీసీకి లోబడి పార్టీల నేతలు, అభ్యర్థులు ప్రచారం చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే సీరియస్ యక్షన్ ఉంటుందని హెచ్చరించారు. అన్ని పొలిటికల్ పార్టీలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో అబ్జర్వర్ల ద్వారా పరిస్థితి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

Also Read : ఈ నెల 8నే సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో గ్రహణం కనిపిస్తుందా? ఎలా చూడాలంటే?

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నగదు తీసుకెళ్తున్న వారికి సీఈసీ వికాస్ రాజ్ కీలక సూచనలు చేశారు. 50వేలకు మించి డబ్బు, బంగారం తీసుకెళ్తొద్దని, ఒకవేళ రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లే క్రమంలో అందుకు తగిన ఆధారాలను మీ దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు.