Telangana CM KCR : ఉమ్మడి వరంగల్ జిల్లాకు సీఎం కేసీఆర్..పంట నష్టం పరిశీలన

ఇటీవలే కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో వారి పంటలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ భావించారు.

KCR Visit Warangal District : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో వారి పంటలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ భావించారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలం, నడికూడ మండలంలో, నర్సంపేట మండలంలో అకాల వర్షానికి పంట నష్టం జరగడంతో జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో 2022, జనవరి 17వ తేదీ సోమవారం సీఎం కేసీఆర్ ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, స్వయంగా పంట నష్టం జరిగిన పంట పొలాల దగ్గరకు వస్తానని హామీనిచ్చారు.  అంతేగాకుండా..కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు.

Read More : Covid-19 New Rule : వ్యాక్సిన్ వేయించుకోకపోతే..నెలకు రూ.8,500 జరిమాన

తెలంగాణలో అకాల వర్షాలు మరోసారి రైతులను నిండా ముంచిన సంగతి తెలిసిందే. ఖరీఫ్‌ సీజన్‌లో అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోవడంతో అన్నదాతలు నష్టపోయారు. ఇప్పటికే పత్తి పంట దిగుబడి తగ్గిపోవడంతో దిగులుతో ఉన్న రైతులపై రబీ సీజన్‌ ప్రారంభంలో కురిసన వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి.

Read More : East Godavari : భార్యతో కలహాలు-పిల్లలతో కలిసి బంగార్రాజు ఆత్మహత్యాయత్నం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో మిర్చి పంటకు భారీ నష్టం జరిగింది. అకాల వర్షాలు హనుమకొండ జిల్లా రైతులకు కష్టాలు మిగిల్చాయి. మిర్చి, మొక్కజొన్న రైతులు నష్టపోయారు. పంటలు నేలపాలయ్యాయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు