Thatikonda Rajaiah: దమ్ముంటే.. రాజీనామా చేయ్.. కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
నేను నికార్సైన మొగోడిని, స్థానికుడిని. నీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Thatikonda Rajaiah: స్టేషన్ ఘనపూర్ లో రాజకీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కడియం శ్రీహరి టార్గెట్ గా రాజయ్య రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కడియం శ్రీహరి వర్గీయులు రాజయ్యపై పైర్ అయ్యారు. స్టేషన్ ఘనపూర్ లో రాజయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
తన దిష్టిబొమ్మ దగ్దంపై రాజయ్య తీవ్రంగా స్పందించారు. కడియం శ్రీహరి చచ్చిన శవం లాంటివాడు అని వ్యాఖ్యానించారు. దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయాలని కడియం శ్రీహరికి సవాల్ విసిరారు. తెలంగాణ అంతా తిరిగి తేల్చుకుందామన్నారు. నా శవయాత్ర చేసినా, ఇంకేం చేసినా నా ఆనవాళ్లు చెరపలేరు అని రాజయ్య అన్నారు. నేను నికార్సైన మొగోడిని, స్థానికుడిని అని చెప్పారు.
మనిషి తెల్లగా కనబడితే కడియం శ్రీహరి ఓర్వలేరు అని విమర్శించారు. నీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కడియం శ్రీహరి రాజీనామా చేస్తాడని చెప్పారు. లేకపోతే రాజ్యాంగ పరంగా చర్యలు ఉంటాయన్నారు. కడియం శ్రీహరి సొంత గ్రామంలో కూడా దెబ్బలు తిన్నారని రాజయ్య అన్నారు.
Also Read: హైదరాబాద్ వాసులకు రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్.. మంత్రి అఫీషియల్ ప్రకటన