Telangana Congress Govt : సీఎంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రుల ప్రొఫైల్..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క తో పాటు 11మంది మంత్రులతో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. 

Telangana Congress Govt..Cm and ministers : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. రాష్ట్ర ఏర్పడిన తరువాత రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వచ్చింది.  కానీ..తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే పట్టుదల నెరవేరేందుకు దాదాపు 10ఏళ్ల పట్టింది. ఈ కృషి ఫలించి ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. సీఎంగా పీసీసీ చీఫ్ రేవంత్, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతో పాటు 11మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ క్యాబినెట్ లోని నేతలు వారి నేపథ్యం ఏంటో తెలుసుకుందాం..

సీఎంగా ఎనుముల రేవంత్‌రెడ్డి..
సీఎంగా ఎనుముల రేవంత్‌రెడ్డి. విద్యార్థి సంఘం నేత నుంచి సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి. రేవంత్ రాజకీయ జీవితం అంతా నల్లేరుమీద నడక కాదు. ఎన్నో స్ట్రగుల్స్ తో సీఎం స్థాయికి చేరుకున్న వ్యక్తి. జడ్పీటీసి స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగిన నేత. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తరువాత టీడీపీలో చేరారు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి గెలుపొందారు. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఉన్న చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ఎన్నో సలహాలు ఇచ్చేవారు. ఆయన సలహాలను చంద్రబాబు పరిగణలోకి తీసుకోవటమే కాకుండా వాటిని ఇంప్లిమెంట్ చేసేవారని ఆయన పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. టీడీపీలో పలు కీలక బాధ్యతల్ని పోషించారు.

ఏపీ, తెలంగాణ విడిపోయాక తెలంగాణలో టీడీపీ ప్రాభవం తగ్గిపోయింది. దీంతో రేవంత్ రెడ్డి ఏపీలో చంద్రబాబు వద్దకు స్వయంగా వెళ్లి పరిస్థితిని వివరించి తాను పార్టీనుంచి తొలగిపోతున్నానిని పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఆ సమయానికి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. బీఆర్ఎస్ హవాతో కాంగ్రెస్, టీడీపీల ప్రాభవం వెలవెలబోయింది.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అతి తక్కువకాలానికే రేవంత్ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాడు. 2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కానీ..టీపీసీసీ చీఫ్‌గా పార్టీని అధికారంలోకి తీసుకురావడలో సక్సెస్ అయ్యారు.రెండు సార్లు MLA, ఒకసారి ఎంపీగా విజయం సాధించిన రేవంత్ కాంగ్రెస్ లో కీలకంగా మారారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించటంలో కీలకంగా మారారు. 2009, 2014లో కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు సాధించారు. 2019లో మల్కాజిగిరి ఎంపీగా విజయం..2023 ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి గెలుపు ఇలా కాంగ్రెస్ ను ఎట్టకేలకు అధికారంలోకి తీసుకురావటంతో కృతకృత్యులయ్యారు..

రేవంత్ క్యాబినెట్ మంత్రులు వీరే..

భట్టి విక్రమార్క, మధిర
సీఎల్పీ నేతగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై రాజీలేని పోరాటం
పాదయాత్రతో పార్టీని బలోపేతం చేసిన నేత
మధిర నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం
2009,14,18,23 ఎన్నికల్లో MLAగా ఎన్నిక
2009-11 వరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి చీఫ్ విప్‌
2011-14 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌


కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ
నల్గొండ జిల్లాలో ప్రజాదరణ ఉన్న నేత
గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం
ఐదుసార్లు MLA, ఒకసారి ఎంపీగా విజయం
1999, 2004, 09, 14, 23 ఎన్నికల్లో నల్లగొండ నుంచి విజయం
వైఎస్ఆర్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో పనిచేసిన అనుభవం
2019లో భువనగిరి ఎంపీగా విజయం


ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, హుజూర్‌నగర్‌
కాంగ్రెస్‌ అధిష్టానంతో సత్సంబంధాలు
పీసీసీ మాజీ అధ్యక్షుడు, టీపీసీసీ కీలక నేత
ఆరుసార్లు MLAగా, ఒకసారి ఎంపీగా విజయం
1999, 2004, 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో MLAగా గెలుపు
2019లో నల్లగొండ నుంచి ఎంపీగా విజయం

దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంథని
తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యమైన నేతల్లో ఒకరు
ఏఐసీసీ పెద్దలతోనూ విస్తృత సంబంధాలు
ఈ ఎన్నికల్లో మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు
గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం
మంథని నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు
1999, 2004, 2009, 2018, 2023 ఎన్నికల్లో MLAగా గెలుపు

కొండా సురేఖ, వరంగల్‌ ఈస్ట్
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌గా గుర్తింపు
గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, విషయ పరిజ్ఞానం
ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం
1999, 2004, 2009, 2014, 2023 ఎన్నికల్లో MLAగా విజయం

దామోదర రాజనరసింహ, అందోల్
ఉమ్మడి ఏపీలో మాజీ ఉప ముఖ్యమంత్రి
దామోదర ఫ్యామిలీ కాంగ్రెస్‌ పార్టీకి వీరవిధేయుడిగా గుర్తింపు
అందోల్‌ నుంచి ఐదుసార్లు MLAగా విజయం
1989, 2004, 2009, 2014, 2023 ఎన్నికల్లో MLAగా గెలుపు
మంత్రిగా పనిచేసిన అనుభవం

సీతక్క @ అనసూయ, ములుగు
ST సామాజిక వర్గంలో బలమైన మహిళా నేత
రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ అండదండలు
గతంలో 15 ఏళ్లు మావోయిస్టుగా అజ్ఞాతవాసం
ములుగు నుంచి మూడుసార్లు MLAగా గెలుపు
2009లో తొలిసారి MLAగా విజయం
2018, 2023 ఎన్నికల్లో MLAగా గెలుపు

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పాలేరు
ఖమ్మం జిల్లాలో బలమైన లీడర్
2014లో ఖమ్మం ఎంపీగా గెలుపు
2023 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు
ఒకసారి MLA, ఒకసారి ఎంపీగా విజయం


తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం
సీనియర్‌ నేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం
గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం
ఆరుసార్లు MLA, ఒకసారి MLCగా విజయం
ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ క్యాబినెట్‌లో పనిచేసిన అనుభవం

జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్
దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ బలోపేతానికి కీలకంగా పనిచేసిన నేత
కొల్లాపూర్ నుంచి వరుసగా 5 సార్లు ఎన్నికైన తొలి ఎమ్మెల్యే
మొత్తం ఆరుసార్లు MLAగా విజయం
కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం

పొన్నం ప్రభాకర్‌, హుస్నాబాద్‌
ఉత్తర తెలంగాణలో బలమైన బీసీ నేత
విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రయాణం
2009లో కరీంనగర్‌ ఎంపీగా విజయం
తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక

ట్రెండింగ్ వార్తలు