CM KCR Delhi Tour : నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. డిసెంబర్ 14న బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

భారత రాష్ట్ర సమితికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గులాబీ బాస్ కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అక్కడి రాజశ్యామల యాగం కూడా నిర్వహించనున్నారు.

CM KCR Delhi Tour : భారత రాష్ట్ర సమితికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గులాబీ బాస్ కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అక్కడి రాజశ్యామల యాగం కూడా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. నాలుగు లేదా ఐదు రోజులు అక్కడే మకాం వేయనున్నారు.

ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభానికి సిద్ధమైంది. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు ముందు రోజే హస్తినకు చేరుకోనున్నారు. బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి 450 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఆహ్వానాలు పంపింది. ఢిల్లీ ఎప్పీ రోడ్డులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఈ నెల 14న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

TRS To BRS : ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ .. ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండాయే : సీఎం కేసీఆర్

ఈ సందర్భంగా పార్టీ ఆఫీప్ ఓపెనింగ్ ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను రేపు సీఎం కేసీఆర్ నేరుగా పర్యవేక్షించనున్నారు.  ఈ నెల 14వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమం మొదలవుతుంది. అక్కడ నిర్వహించే రాజశ్యామల యాగం కోసం యాగశాలను నిర్మిస్తున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ పరిశీలించారు.

కార్యాలయం ప్రారంభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడి చాంబర్ లో సీఎం కేసీఆర్ ఆసీనులు కానున్నారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించే సభలో ఆయన మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నాయకులకు, ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు.

Minister Mallareddy: బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దేశంలో ఐటీ రైడ్స్ ఉండవు: మంత్రి మల్లారెడ్డి

జేడీయూ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, సమాజ్ వాది పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు, రైతు సంఘాల నేతలు, ఇతరవర్గాల ముఖ్యులు కలుపుకుని సుమారు 450 మంది ప్రముఖులు హాజరయయ్యే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు