Cm Revanth: నెక్లెస్ రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీ.. 21 ఏళ్లకే యువతకు రాజకీయ అధికారం.. సీఎం రేవంత్ సంచలన డిమాండ్

ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth).

telangana cm revanth reddy demands reducing election age limit to 21

  • పోటీ వయసు తగ్గింపు
  • అసెంబ్లీలో తీర్మానానికి నిర్ణయం
  • నెక్లెస్ రోడ్డులో ర్యాలీ

Cm Revanth: భారత రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాలనే చర్చ సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న యువతకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినప్పుడే వారి సమస్యలకు తగిన పరిష్కారాలు దొరుకుతాయని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. చట్టసభల్లో యువ రక్తం ప్రవహించినప్పుడే దేశ పురోగతి మరింత వేగవంతమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Buffalo Attack: పెంచుకున్న గేదె.. పొడిచి చంపేసింది.. హైదరాబాద్‌లో తీవ్ర విషాదం

21 ఏళ్లకే పోటీ చేసే అవకాశం.. అసెంబ్లీలో తీర్మానానికి సిద్ధం:

నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పీపుల్స్ ప్లాజా నుంచి జరిగిన ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీలో త్వరలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని స్పష్టం చేశారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.