CM Revanth Reddy : నాడు రేవంత్ రెడ్డిగా.. నేడు రేవంతన్నగా.. 20ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ పోస్ట్..

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికై నేటితో 20ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన భావోద్వేగ పోస్టు చేశారు.

Telangana CM Revanth Reddy 20 Years Political Journey

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికై నేటితో 20ఏళ్లు పూర్తయింది. ఈ 20 వసంతాలలో ఇండిపెండెంట్ జడ్పీటీసీగా గెలుపొందిన నాటినుంచి ప్రజల మన్ననలు పొందుతూ.. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (ZPTC to CM) కొనసాగుతున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ రేవంత్ రెడ్డి తన అధికారిక ఎక్స్ ఖాతాలో భావోద్వేగా పోస్టు చేశారు.

Read Also – Rythu Bharosa : రైతులకు మరో శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. వారికి కూడా రైతుభరోసా నిధులు.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ..

లక్ష అక్షరాలతో రాసినా.. కోటి పదాలతో అల్లినా.. మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకం ఈ రెండు దశాబ్దాల జీవితం. అప్పుడు మిడ్జిల్‌లో రేవంత్ రెడ్డిగా ప్రారంభమైన నా ప్రయాణం.. ఈరోజు మీ అందరి హృదయాల్లో రేవంతన్నగా నిలిచే స్థాయికి చేరడం నా జీవితంలో ఒక అపూర్వమైన అధ్యాయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ 20 ఏళ్ల ప్రజా జీవితంలో ప్రతి క్షణంలో, ప్రతి సంఘటనలో, ప్రతి పోరాటంలో, ప్రజలకోసం నేను సాగించిన ప్రతి ఉద్యమంలో నాతో కలిసి నడిచిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పార్టీ కార్యకర్తలకు, నాపై విశ్వాసం ఉంచి అండగా నిలిచిన ప్రతీఒక్కరికీ రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలనే తపనతో.. మీ అందరి ఆశీస్సులను బలంగా తీసుకొని.. రాబోయే రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక శ్రామికుడిగా.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా.. అన్నింటికంటే మీ రేవంతన్నగా మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత దృఢంగా నిలబెట్టుకుంటానని మరోసారి మీకు మాటిస్తున్నా అంటూ రేవంత్ భావోద్వేగంగా పేర్కొన్నారు.