Rythu Bharosa 2026 : రైతులకు మరో శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. వారికి కూడా రైతుభరోసా నిధులు.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ..
Rythu Bharosa 2026 : రైతుభరోసా పథకం కింద ఐదు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
rythu bharosa Scheme 2026
Rythu Bharosa 2026 : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పంటల సాగు ప్రారంభంలో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి పెట్టుబడి సాయం కింద నిధులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికి ఎకరానికి రూ.12వేలు చొప్పు రెండు విడతల్లో అందజేస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుతల వారిగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తోంది. ప్రస్తుతం నాల్గో విడత నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.
Also Read : ED Auctions Seized Aircraft : దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ఈడీ.. ఎంతకు విక్రయించారంటే?
తొలి విడతలో రెండు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 44.27లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రెండో విడతలో భాగంగా.. రెండు నుంచి మూడు ఎకరాల సాగుభూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.1,590.02 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 26.50లక్షల ఎకరాల సాగుభూమికిగాను 10.68 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అయ్యాయి.
మూడో విడతలో భాగంగా మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,330.32 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, 22.17లక్షల ఎకరాల సాగుభూమికి రైతుభరోసా సాయం అందినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తాజాగా.. నాల్గో విడతలో శుక్రవారం ఐదు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా
నిధులు జమ అయ్యాయి. నాలుగో విడతలో 4.41 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.1188 కోట్లు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
నాలుగు విడతల్లో కలిపి 65.76 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6590.37 కోట్ల నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
